Sudheer: జబర్దస్త్ కమెడియన్ గా మొదలైన అయిన సుధీర్ ప్రయాణం ప్రస్తుతం హీరో రేంజ్ కి వచ్చింది. ఈయన కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత పలు షోలలో మ్యాజిక్ లు చేస్తూ అలాగే యాంకరింగ్ కూడా చేస్తూ మేల్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు సినిమాల్లో హీరోగా చేస్తూ టాలీవుడ్ లో కూడా రాణిస్తున్నారు. అయితే అలాంటి సుధీర్ తాజాగా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘సర్కార్ 5’ అనే షోకి హోస్టుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ షోకి సంబంధించి ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రోమో పూర్తిగా నవ్వులు పూయిస్తూ.. చూసిన ప్రతి ఒక్కరికి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ షోకి వచ్చిన ఒక నటి సుధీర్ ని అంకుల్ అంటూ పరువు తీసేసింది. మరి ఇంతకీ ఆమె ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
షోలో సుధీర్ కి అవమానం..
ఆహా ఓటీటీ లో సుధీర్ హోస్ట్ గా చేస్తున్న సర్కార్ -5 ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హీరోయిన్ దక్షా నగార్కర్, కోర్ట్ మూవీ జోడి హర్ష్ రోషన్, జాబిలి అలియాస్ శ్రీదేవి,యాంకర్ రీతూ చౌదరి,జబర్దస్త్ యాదమ్మ రాజు వంటి పలువురు సెలబ్రిటీలు వచ్చారు. ఇక ఈ షోకి హీరోయిన్స్ రావడంతోనే వారికి తనదైన స్టైల్ లో వెల్కమ్ చెప్పడమే కాకుండా అందరినీ బుట్టలో వేయాలని ప్రయత్నించారు సుధీర్. హీరోయిన్ల అందరిని తన మాటలతో మాయ చేశారు. అలాగే ఇద్దరు హీరోయిన్లకు ఒకే మాట చెప్పి బుక్ అయ్యి.. అది నేను కాదు ఎవడో వెదవ చెప్పాడు అని తన పరువు తానే తీసుకున్నాడు సుధీర్. ఇక ఇదే షోలో శ్రీదేవి,హర్ష్ రోషన్ కూడా వచ్చి ఎంటర్టైన్ చేశారు. నాకు ఇష్టమైన సబ్జెక్టు ఇంగ్లీష్ అని శ్రీ దేవి అంటే.. వన్ మినిట్ గుక్క తిప్పకుండా ఇంగ్లీష్ లో మాట్లాడమని హర్ష్ రోషన్ కౌంటర్ ఇస్తాడు. అలాగే ఓ అమ్మాయి చేతిలో ఏదో పట్టుకొని వచ్చి నిల్చున్న టైంలో అంకుల్ ఫౌండర్ ఆంటీ అంటూ ఈ షోకి వచ్చిన ఓ కుర్ర బ్యూటీ కామెంట్ చేయడంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వేశారు. అంతేకాదు సుధీర్ పక్కన ఉన్న అమ్మాయి ఆంటీలా లేదు కేవలం సుధీర్ మాత్రమే అంకుల్ లా ఉన్నారని అర్థం వచ్చేలా మాట్లాడి మళ్లీ సుధీర్ పరువు తీసేశారు.
మరీ ఇంతలా పరువు తీయించుకోవాలా..
ఇక షోలోకి వచ్చిన వాళ్ళ పై సుధీర్ పంచులు వేయడమే కాదు ఆ షోకి వచ్చిన వాళ్ళు కూడా సుధీర్ పై పంచ్ ల మీద పంచులు వేస్తూ షో మొత్తం నవ్వులు పూయించారు. ఇక ఈ షోలోకి వచ్చిన ఒక హీరోయిన్ సుధీర్ అడిగిన ప్రశ్నకి క్లూ రాబట్టడం కోసం ఆయనకు లైవ్ లోనే ఐ లవ్ యూ చెప్పింది. ఇక షో చివర్లో ఓ నటి సుధీర్ నాకు చాలా రోజుల నుండి తెలుసు. లుకింగ్ లైక్ ఏ డాపర్ అంటే.. ఏంటి డైపరా అంటూ మళ్ళీ నవ్వులు పూయించారు సుధీర్. ప్రస్తుతం ఈ సర్కార్ -5 పై ప్రోమో చూస్తున్నంత సేపు ఫుల్ గా నవ్వుతారు.ఇక ప్రోమోనే ఇలా ఉంటే పూర్తి ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని ఈ ప్రోమో చూసిన చాలా మంది నెటిజన్లు వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు చాలామంది కేవలం సుధీర్ కోసం మాత్రమే ఈ షో చూస్తున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు.
ALSO READ:Ileana: రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న ఇలియానా.. కండిషన్స్ అప్లై!