Diwali Tickets Booking: దీపావళి పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 20న దీపావళికి పండుగ రానుంది. ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ తాజాగా ముందస్తు రిజర్వేషన్ ప్రారంభించింది. దీపావళి ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ఈ టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు రైళ్లకు సంబంధించి పావుగంటలో టికెట్లు అన్ని అయిపోయాయి.
చెన్నై ఎగ్మోర్-మధురై మధ్య నడిచే పాండియన్ ఎక్స్ ప్రెస్ (రైలు 12637) లాంటి ప్రధాన రైళ్లు, స్లీపర్ క్లాస్ లో టికెట్లు ప్రస్తుతం వెయిట్ లిస్టులో చూపిస్తున్నాయి. ఇతర తరగతులలో పోర్టల్ తెరిచిన గంటల్లోనే వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత అయ్యింది. ఎగ్మోర్- తిరునెల్వేలి మధ్య ఉన్న నెల్లై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (రైలు 12631) లో, మధ్యాహ్నం నాటికి అన్ని కోచ్‌లు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. చెన్నై సెంట్రల్ నుంచి త్రివేండ్రం వరకు ప్రయాణించే త్రివేండ్రం మెయిల్ (రైలు 12623) లాంటి పలు ఇతర రైళ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ప్రయాణీకుల అసంతృప్తి
క్షణాల్లోనే టికెట్లు అన్నీ అయిపోవడం పట్ల టికెట్లు దొరకని ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “రైల్వే టికెట్లను బుక్ చేసుకోవడం చదరంగం ఆటలా మారింది. జనరల్ కోటా రిజర్వేషన్ లో నాకు ఎప్పుడూ టికెట్ లభించదు. తత్కాల్ టికెట్లపై ఆధారపడవలసి వస్తుంది. తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు, నేను కనీసం 100 MBPS ఇంటర్నెట్ వేగంతో కంప్యూటర్‌ను ఉపయోగించాలి. వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న వాలెట్ సౌకర్యాన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఇది కార్డ్ చెల్లింపుల కంటే వేగంగా ఉంటుంది. టికెట్ దొరికే అవకాశం ఉంటుంది. టికెట్లు అందుబాటులో లేకపోతే, విమానాలు మాత్రమే ఎంపిక అయినప్పటికీ అవి ఖరీదైనవి” అని కొట్టాయంకు తరచుగా రైలులో ప్రయాణించే చెన్నై నివాసి జైవిన్ జాయ్ వెల్లడించారు.
రైళ్లకు ముందస్తు రిజర్వేషన్(ARP 60) రోజులు, ప్రయాణ తేదీని మినహాయించి టికెట్ బుకింగ్ విండో ఉదయం 8 గంటలకు తెరుచుకుంటుంది. “ప్రత్యేక రైళ్ల టికెట్లను దీపావళికి వారం ముందు ప్రకటిస్తారు” అని సౌత్ రైల్వే అధికారులు తెలిపారు
ముందస్తు రిజర్వేషన్ తేదీలు
ఆగస్టు 18: అక్టోబర్ 17 (శుక్రవారం) వరకు తెరిచి ఉంటుంది.
ఆగస్టు 19: అక్టోబర్ 18 (శనివారం) వరకు తెరిచి ఉంటుంది.
ఆగస్టు 20: అక్టోబర్ 19 (ఆదివారం) వరకు తెరిచి ఉంటుంది.
ఆగస్టు 21: అక్టోబర్ 20 (సోమవారం) వరకు తెరిచి ఉంటుంది.
ఆగస్టు 22: అక్టోబర్ 21 (మంగళవారం) వరకు తెరిచి ఉంటుంది.
ఆగస్టు 23: అక్టోబర్ 22 (బుధవారం) వరకు తెరిచి ఉంటుంది.
ఆగస్టు 24: అక్టోబర్ 23 (గురువారం) వరకు తెరిచి ఉంటుంది.
ఆగస్టు 25: అక్టోబర్ 24 (శుక్రవారం) వరకు తెరిచి ఉంటుంది.
ఆగస్టు 26: అక్టోబర్ 25 (శనివారం) వరకు తెరిచి ఉంటుంది.
ఆగస్టు 27: అక్టోబర్ 26 (ఆదివారం) వరకు తెరిచి ఉంటుంది.
Read Also: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!