BigTV English

Ayodhya Temple :భవిష్యత్ తరాలకు తెలిసేలా అయోధ్య టైమ్ క్యాప్సుల్

Ayodhya Temple :భవిష్యత్ తరాలకు తెలిసేలా అయోధ్య టైమ్ క్యాప్సుల్
Ayodhya Temple

Ayodhya Temple : దేశంలో రాముడే దేవుడని నమ్మే వారి సంఖ్యకి కొదవలేదు. ముఖ్యంగా రామజన్మస్థలంగా భావించే అయోధ్య రామాలయం ఎప్పుడు పూర్తవుతుందా అనే వేయి కళ్లతో ఎదురుచూసే వారే ఎంతోమంది
2024 జనవరి 1న రామ మందిరాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రామ మందిరాన్ని 2.77 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తుతో రూపొందిస్తున్నారు.


ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఒక్కో అంతస్థు 20 అడుగులు ఉంటుంది. మొదట అంతస్తులో 160, మొదటి అంతస్తులో 132 , రెండవ అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణంలో భాగంగా పునాది నింపేందుకు 17వేల గ్రానైట్‌ రాళ్లను ఉపయోగించారు. తెలంగాణ, కర్ణాటక నుంచి ఈ రాళ్లను తీసుకొచ్చారు.

అయోధ్య రామాలయ చరిత్ర, వెనక జరిగిన పరిణామాలు, వాస్తవాలు, వివాదాలన్నింటినీ తేదీలతో సహా పట్టికతో టైమ్ క్యాప్సుల్‌ని రామాలయం నిర్మించే ప్రదేశంలో 2000 అడుగుల లోతున భద్రంగా దాచిపెట్టారు. భవిష్యత్తులో ఎవరైనా ఈ ఆలయంపై వివాదానికి తెర తీస్తే ఈ టైమ్ క్యాప్సుల్ ద్వారా సమాధానం దొరికే విధంగా ఇలా ప్లాన్ చేశారు. ఆలయ నిర్మాణం కింద రాగి ప్లేట్ కింద ఈ టైమ్ క్యాప్సుల్‌ని ఏర్పాటు చేశారు.


రామాలయ నిర్మాణ పనులను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సోమ్ పురా ఫామిలీ చేపట్టింది. చంద్రకాంత్ సోంపురా 30 సంవత్సరాల క్రితం అయోధ్యలోని రామ్ లల్లాకు ఆలయ పనులు ప్రారంభించారు. . 1983లోనే సోంపురా రామమందిర ఆకృతికి రూపం ఇచ్చారు. అష్టధాతువుతో తయారు చేసిన బాహుబలి గంట రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణ కానుంది. రామాలయంలో నెలకొల్పే 2100 కిలోల బరువైన గంట హిందూ ముస్లిం ఘంటా నాదంగా మారనుంది.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గంటను ఇక్బాల్‌ మిస్త్రీ అనే ముస్లిం కళాకారుడు రూపకల్పన చేశారు

Related News

Bathukamma 2025: అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Big Stories

×