BigTV English

Shai Vakri 2024: శని తిరోగమనం.. ఈ రాశుల వారు అనుకున్నవన్నీ జరుగుతాయ్

Shai Vakri 2024: శని తిరోగమనం.. ఈ రాశుల వారు అనుకున్నవన్నీ జరుగుతాయ్

Shai Vakri 2024: శని కర్మను ప్రసాదించే దేవుడిగా చెబుతారు. శని దేవుడు ఏ వ్యక్తి పట్ల దయ చూపితే ఆ వ్యక్తి అన్ని పనులను సులభంగా నిర్వహిస్తాడు. లేదంటే శని వల్ల సమస్యలు తప్పవు. శని దేవుడి అనుగ్రహం ఉంటే ఆర్థిక సమస్యలు శారీరక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం రెండున్నర సంవత్సరాల తర్వాత తన రాశిని మార్చుకుంటుంది. ప్రస్తుతం శని కుంభ రాశిలోకి సంచరిస్తున్నాడు.


ప్రస్తుతం రాహువు వక్రమార్గంలో కదులుతున్నాడు. నవంబర్ 15 వరకు రాహువు వ్యతిరేక దిశలోనే సంచరించనున్నాడు. రాహువు యొక్క వక్ర దశ మూడు రాశులపై ఉంటుంది. ఈ సమయంలో ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందో ఎవరు అభివృద్ధి చెందుతారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శని తిరోగమనం వల్ల కొన్ని రాశుల వారు ప్రయోజనాలను పొందుతారు. 12 రాశుల్లో శనిగ్రహం విశేషంగా కొంతమందిపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో త్వరగా ధనవంతులు అవుతారు. నవంబర్ 15 వరకు శని విశేష ఆశీస్సులు పొందబోతున్న రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి: శని యొక్క ప్రభావం మేష రాశివారిపై ఎక్కువగా ఉంటుంది. శని ప్రభావం వల్ల ఉద్యోగంలో మీకు చాలా వరకు సమస్యలు ఎదురవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలను కూడా పొందుతారు. మీరు మీ రంగంలో విజయాలను సాధిస్తారు . మనస్సులో సంతృప్తి పెరుగుతుంది. పని సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడి ప్లాన్ చేస్తే ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఇది కాకుండా గతంలో పెట్టుబడి పెట్టిన వాటి నుంచి కూడా మీకు మంచి రాబడి లభిస్తుంది. వ్యాపారంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం అవుతాయి. ప్రత్యర్థులకు మీరు గట్టి పోటీని ఇస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశి ఇంట్లో శని సంచాకం వల్ల జీవితంలో అనుకూలమైన ప్రభావం ఉంటుంది. కొన్ని రోజులుగా ఆలస్యం అవుతున్న పనులు ఈ సమయంలో పూర్తవుతుంటాయి. మీరు ఊహించినంత డబ్బు కూడా మీరు సంపాదిస్తారు. ఉద్యోగ రీత్యా పదోన్నతులు, జీతాల పెంపుదల సాధ్యం అవుతుంది. వ్యాపారంలో తెలివిగా పెట్టుబడులు పెట్టడం అవసరం. దీని తర్వాత పని వాతావరణం కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది.

ధనస్సు రాశి: శని తిరోగమనం కారణం ధనస్సు రాశి వారికి మంచి సమయం. వ్యాపారంలో పురోగతి కూడా ఉంటుంది. పెండింగులో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. విద్యారంగంలో లాభాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయి. ప్రతి ఆందోళన నుంచి మీరు ఉపశమనం పొందుతారు. పరస్ఫర ప్రేమ బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా వరకు మెరుగు పడతాయి.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భాగస్వామితో సంబంధాలు రోజు రోజుకు మెరుగు పడతాయి . వ్యాపారం, ఉద్యోగాల్లో కూడా లాభపడతారు. సంపద ఆస్తులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కెరీర్‌లో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. శనిదేవుడి అనుగ్రహంతో మీ పనులు కూడా త్వరగా పూర్తవుతాయి.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×