It is said that beauty is a curse for him and has caused problems for sportsmen: పారిస్ ఒలింపిక్స్‌లో పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సోకు చేదు అనుభవం ఎదురైంది. ఎందుకంటే ఆమె అందమే ఆమెకు శాపంగా మారింది.అందంగా ఉండి తోటి క్రీడాకారులను ఇబ్బందులకు గురి చేసిందంటూ ఆమెను పరాగ్వే బృందం స్వదేశానికి పంపించింది. స్విమ్ సూట్‌లతో కనిపిస్తూ అక్కడికి వచ్చిన వారందరి దృష్టిని ఆకర్షిస్తూ తన సొంత టీమ్‌కు చిరాకు తెప్పిస్తోందని వారంతా వాపోయారు.
అంతేకాదు తన అందంతో మత్తెక్కించే కళ్లతో తన కెరీర్‌కు పుల్‌స్టాప్ పడినట్టు అయింది. తన అందమైన రూపాన్ని కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణంగా మారింది. తమ క్రీడాకారుల ఏకాగ్రతను దెబ్బ తీస్తోందని భావించి ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఇంటికెళ్లిన మరుసటి రోజే ఆమె స్విమ్మింగ్‌కు గుడ్ బై చెప్పారు. సెప్టెంబరు 19, 2004న జన్మించిన లువానా అలోన్సో.. తన గ్లామర్ తోనే ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8,98 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన ఆమె జులై 27న 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లో సెమీఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయింది.అలోన్సో ప్రస్తుతం డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది.
Also Read: ఐపీఎల్‌లో ఆర్‌ఆర్‌ఆర్ కాంబినేషన్ అదుర్స్, ఎందుకంటే.!
ఆమె 17 సంవత్సరాల వయస్సులో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తన దేశానికి మొదటిసారి ప్రాతినిధ్యం వహించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె రెండవసారి కనిపించింది. తనపై తీసుకున్న చర్యలతో అలోన్సో బాధపడింది. తన స్విమ్మింగే జీవితంలో అన్నీ నేర్పిందంటూ అలోన్సో తన ఇన్‌స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేసింది. ఇక ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు అందరూ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఏందండి పాపం.. అందంగా ఉండటం ఆ అమ్మాయి నేరమా అంటూ తనకి మద్దతును ప్రకటిస్తున్నారు. మరికొందరు అయితే అంత అందం ఎక్కడి నుంచి భామ అంటూ మనసు పారేసుకుంటున్నారు. ఇక ఇంకొందరు అయితే అలాంటి ఆటకు గుడ్‌బై చెప్పి మంచి పని చేశావంటూ ఆవిడపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.