BigTV English

Kuja Dosha: కుజ దోషం ఉందా? ఇంకెందుకు ఆలస్యం

Kuja Dosha: కుజ దోషం ఉందా? ఇంకెందుకు ఆలస్యం

Kuja Dosham: ఈ మధ్యకాలంలో పెళ్లికాని ప్రసాదులు, ఊర్వశిలు ఎక్కువగా ఉన్నారు. మూడు పదుల వయస్సు దాటినా పెళ్లిళ్లు అయిన సందర్భాలు కనిపించలేదు. దీంతో యువతీ యువకుల తల్లిదండ్రుల్లో ఒకటే కంగారు. కుజ దోషం ఉన్నా ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు జ్యోతిష్యులు. నివారణ కోసం కొన్ని పరిష్కారాలు సూచిస్తున్నారు. వాటిని పాటిస్తే ఉపశమనం దొరుకుతుందని అంటున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం.


జ్యోతిష్య శాస్త్రంలో కుజ దోషం అనేది ఒక వ్యక్తుల జాతక చక్రంలో కుజుడు గ్రహం నిర్దిష్ట స్థానం వల్ల ఏర్పడే స్థితి. దీన్ని మంగళ దోషం అని కూడా చెబుతుంటారు. కుజ దోషం వల్ల కంగారు పడాల్సిన పని లేదన్నది పండితులు మాట. కుజుడుని ధైర్యానికి, సాహసానికి, పోరాట శక్తికి కేరాఫ్‌గా భావిస్తారు. కుజుడు అగ్ని‌తత్వ గ్రహం కావడంతో కోపం ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు ఆవేశం, దూకుడు స్వభావాలు ఉంటాయి. కుజ దోషం ఉన్నవారికి పై చెప్పిన లక్షణాలు కలిగి ఉంటారు. ప్రస్తుతం రోజుల్లో అలాంటి స్వభావం వల్ల సమస్యలు ఎదురవుతాయని బలంగా నమ్ముతారు.

కుజ దోషం అనేది వ్యక్తుల జాతకంలో జన్మ లగ్నాది 1, 2, 4, 7, 8, 12వ స్థానాల్లో ఉన్నట్లయితే ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆయా స్థానాలను పరిశీలించిన కుజ గ్రహం తీవ్రతను అంచనా వేస్తుంటారు. కుజుడు ఉగ్ర గ్రహం కావడంతో ఆ స్థానాలలో ఉంటే దాని ప్రభావం వల్ల వ్యక్తులు, కుటుంబంపై ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుజ దోషం ఉన్న జాతకులకు వివాహం, వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు లేకపోలేదు. ఆలస్యంగా వివాహం కావొచ్చు. వివాహాలు కుదిరినట్లే కుదిరి చివరి నిమిషంలో డ్రాపైన సందర్భాలు లేకపోలేదు. దీనివల్ల మానసిక క్షోభ కలుగుతుంది.


కుజ దోష ప్రభావాలను తగ్గించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. ఈ విషయాన్ని జ్యోతిష్యులు స్వయంగా చెబుతున్నారు. ఆ దోషం ఉన్నవాళ్లు ప్రతిరోజు కుజ గాయత్రీ మంత్రం 108 సార్లు జపించడం మంచిది. ఆంజనేయ గాయత్రీ మంత్రం జపించడం కూడా మంచిదని అంటున్నారు. వీటికితోడు హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పారాయణం చేయాలి. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం, హనుమంతుడిని పూజించడం శుభప్రదం. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనది. ఆ రోజు పూజలు చేయడం, షష్టి నాడు సుబ్రహ్మణ్య అష్టకం ఏడు సార్లు పారాయణం చేయడం ఉత్తమం.

ALSO READ: 12 ఏళ్ల తర్వాత అదృష్టం.. ఆ మూడు రాశులకు తిరుగులేదు

వీటికి తోడు నవ గ్రహాలు తిరగడం మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నమాట. మంగళవారం రాగి, బెల్లం, కందిపప్పు, ఎర్రని బట్టలు, ఎర్రని వస్తువులు దానం చేయడం వల్ల కుజ దోషం నుంచి విముక్తి కలుగుతుంది. ఆవులకు ఆహారం పెట్టడం, గాయపడిన కుక్కలు చికిత్స చేయించడం మంచిది కూడా. ఏపీలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కుజ దోష నివారణకు ఎంతో ప్రసిద్ధి చెందింది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో శాంతి పూజ చేయడం నివారణకు సహాయపడుతుంది.

 

సూచన: పైన తెలియజేసిన సమాచారం కొన్ని శాస్త్రాలు, కొంతమంది పండితులు చెప్పిన విషయాల ఆధారంగా తెలియజేశాం. వీటిని ఎంత వరకు నమ్మాలో లేదా అనేది మీ వ్యక్తిగత విషయం. దయచేసి ఈ విషయాన్ని మరిచిపోవద్దు.

Related News

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Big Stories

×