Mohan Lal: ఈ మధ్యకాలంలో హీరోలు హీరోయిన్లు తాము ఇండస్ట్రీలో ఒక పొజిషన్లో ఉండగానే తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ కిడ్ కూడా చేరబోతోంది. వాస్తవానికి మాలీవుడ్ లో నటవారసుల అరంగేట్రం గురించి ఇప్పుడు చర్చ మొదలైంది అని చెప్పాలి. నిజానికి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలలో నట వారసుల రాక గురించి నిరంతరం ఏదో ఒక కథనం వెలువడుతూనే ఉంటుంది. కానీ అటు బాలీవుడ్ నట వారసులపై అంత ఆసక్తికర స్టోరీస్ ఏవీ కూడా లేవు అని చెప్పవచ్చు .
సినీ ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమైన మోహన్ లాల్ కూతురు..
సాధారణంగా మలయాళం స్టార్ కిడ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) వారసుడు దుల్కర్ సల్మాన్ (Dulquar Salman). ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరొకవైపు దర్శకుడు ప్రియదర్శన్ (Priyadarshan ) కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshin) కూడా యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే మోహన్ లాల్ (Mohan Lal) కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ (Pranav Mohan Lal) కూడా సినిమాలలో నటిస్తున్నా.. పెద్దగా వార్తల్లో నిలబడడు. కానీ ఇప్పుడు మోహన్ లాల్ కుమార్తె ప్రణవ్ మోహన్ లాల్ సోదరి విస్మయ (Vismaya ) ఇప్పుడు మాలీవుడ్ నటన అరంగేట్రం చేయబోతుందని సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. జూడ్ ఆంథనీ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్న ‘తుడక్కం’ సినిమా ద్వారా విస్మయ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. స్వతహాగా ఈమె ఒక గొప్ప రచయిత. కథలు రాయడమే కాదు చెప్పడంలో కూడా దిట్ట. అయితే ఇప్పుడు మాత్రం నటిగా అడుగులు వేస్తూ ఉండడంతో ఆసక్తి రేకెత్తుతోంది.
సోదరి ఎంట్రీ కోసం ప్రణవ్ ఎదురుచూపు..
ఇకపోతే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ప్రణవ్ మోహన్ లాల్ తన సోదరికి అభినందనలు తెలియజేశారు. “నా సోదరి సినిమా ప్రపంచంలోకి మొదటి అడుగు వేస్తోంది. ఈ ప్రయాణంలో ముందుకు సాగుతున్న తనపై నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఆమె నటనను చూడడానికి ఎంతో ఉత్సాహంగా కూడా ఉన్నాను” అంటూ ప్రణవ్ సోషల్ మీడియా ద్వారా రాసుకొచ్చారు. ఇక ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో విస్మయ కి పలువురు నెటిజన్స్ మోహన్ లాల్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మోహన్ లాల్ కెరియర్..
మోహన్ లాల్ కెరియర్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస పెట్టి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇటీవలే కన్నప్ప సినిమాలో రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించి ఆకట్టుకున్న ఈయన మరొకవైపు పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఎంపురాన్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు. అంతేకాదు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన తుడరుమ్ విజయంతో మరింత ఉత్సాహంగా మారారు. ఇప్పుడు ఈయన వారసురాలు కూడా ఇండస్ట్రీలోకి అరంగేట్రం ఇవ్వబోతోంది. మరి ఈమె కూడా తన తండ్రిలాగే నటన విషయంలో భారీ పాపులారిటీ సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ALSO READ:Kajal Agarwal: చందమామ మెచ్చిన సౌత్ స్టార్ అతడే.. రామ్ చరణ్, బన్నీ కూడా ఆ లిస్టులో లేరే!