Intinti Ramayanam Today Episode july 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీకరు చక్రధర్ ని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడు. అవని ఫోన్ చేసి మీ అత్తయ్యకు ఈ విషయాన్ని చెప్పి ఫైల్ గురించి వెతుకు శ్రీకర్ అని అంటుంది. శ్రీకరు రాజేశ్వరి దగ్గరికి వెళ్లి అవని వదిన మీకు అంత చెప్పింది కదా అత్తయ్య నేను మావయ్యకి వాళ్ళకి సంబంధం ఏమైనా ఉందేమో అని తెలుసుకోవడానికి వచ్చాను. ఒకవేళ వీళ్లిద్దరికి సంబంధం గనక ఉంటే ఆ ఫైల్ ఇక్కడే ఉంటుంది కదా అత్తయ్య మళ్ళీ ఆస్తులని తిరిగి తెచ్చుకోవచ్చు అని అడుగుతాడు. ఆ మాట వినగానే రాజేశ్వరి పదా నీకు మామయ్య ఫైల్స్ పెట్టే గదిని చూపిస్తానని తీసుకెళ్తుంది.
అప్పుడే ఫైల్ మర్చిపోయిన చక్రధర్ ఇంటికి వస్తాడు..రాజేశ్వరి శ్రీకర్ కి మెసేజ్ చేస్తుంది. శ్రీకరు జస్ట్ మిస్ అయ్యి తప్పించుకుంటాడు. ఇక ఆ ఫైల్ దొరకలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత అవని ఆరాధ్యను స్కూల్ కి తీసుకెళ్లమని రాజేంద్ర ప్రసాద్ తో చెబుతుంది.. కానీ భరత్ నేను తీసుకెళ్తాను అక్కని అంటాడు. కానీ రాజేంద్రప్రసాద్ ఏమైందమ్మా నువ్వు ఈ రోజు తీసుకెళ్లట్లేదని అడుగుతాడు.. అవని అక్షయ్ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకి వెళ్తారు… అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంటర్వ్యూ కోసం వెళ్లిన అవని నిదానంగా లోపలికి వెళ్ళగానే అక్కడున్న వార్డు బాయ్ ను నా పేరు పిలిచారంట నేను ఇంటికి వెళ్లొచ్చా అని అడుగుతుంది. అతను లేదమ్మా ఒకసారి పేరు పిలుస్తారు రెండో సారి పిలవరు అని అంటాడు. ఆ మాట వినగానే అక్షయ్ నవ్వుతాడు.. మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అవని అడుగుతుంది. ఒకసారి పిలిచిన వాళ్ళని రెండోసారి పిలవాలని తెలియదా అయినా నువ్వు లేట్ వస్తావా అని అక్షయ్ అంటాడు. అవని నాకు జాబ్ రాకపోయినా పర్వాలేదు ఇది వస్తే బాగుండు అని అనుకున్నాను కానీ రాలేదు ఆయనకైనా వస్తే బాగుండు అని అనుకుంటుంది.
ఇంటర్వెల్ కి వెళ్లిన అక్షయ్ ని అక్కడ వాళ్ళు ముందు ఏం చేశారని అడిగితే రాజేందర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి చెప్తారు.. ఎందుకు ఆ కంపెనీ నుంచి వచ్చారు అని అడిగితే అక్కడ జరిగిన విషయాన్ని మొహమాటం లేకుండా అక్షయ్ చెప్తాడు.. ఓకే అండి మీరు బయట వెయిట్ చేయండి అని అక్షయతో అంటారు. కాసేపు ఆగిన తర్వాత అటెండర్ వచ్చి ఒక అమ్మాయిని సెలెక్ట్ అయ్యావని చెప్తారు. కానీ అక్షయ్ నా పేరు చెప్పలేదండి అని అడుగుతారు. అయితే అక్షయ్ నా పేరు ఎందుకు పిలవలేదు అని లోపలికి వెళ్లి ఆఫీసర్లతో గొడవ పెట్టుకుంటారు.
నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు సార్ ఏదైనా కారణం ఉందా అని అడుగుతాడు. ఆఫీసర్లు నీకు అన్నీ క్వాలిఫికేషన్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ నీ కంపెనీని నువ్వే కాపాడుకోలేవు అలాంటిది ఇప్పుడు మా కంపెనీలో నువ్వు ఎలా జాబ్ చేస్తావని వాళ్ళు అడుగుతారు. ఈ జాబ్ లేకపోతే ఏంటి ఇంకొక 100 జాబులు ఉన్నాయి అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. బయటికి రాగానే అవని మీకు జాబ్ వచ్చిందండి ఎంత మీతో మాట్లాడకపోతే నాకు జాబ్ వచ్చిన విషయాన్ని కూడా చెప్పరా అనేసి అడుగుతుంది. కానీ వార్డ్ బాయ్ వచ్చి లోపల ఆఫీసర్లు నీ కంపెనీని కాపాడుకోలేని వాడివి ఎలా జాబ్ చేస్తావు అని అన్నారుగా అని అంటాడు.
ఆ మాట వినగానే అవని అక్షయ్ పై సీరియస్ అవుతుంది.. భార్య మాట వినకుంటే ఎవడి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుందని అటెండర్ కూడా చెప్తాడు.. నేను నా భార్య మాట వినకుండా అకౌంటెంట్ నుంచి అటెండర్ కి షిఫ్ట్ అయ్యాను. అదే నా భార్య మాట వినుంటే ఆఫీసర్ పొజిషన్లో ఉండే వాడిని ఏమో అని ఆయన కళ్ళు తెరిపిస్తాడు. ఇక అవని ఆ మాట వినగానే పళ్ళు నన్ను అవుతుంది. ఇక పార్వతీ మాత్రం ప్రణతి చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది.
ప్రణతి మరో తప్పు చేస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది.. అటు భానుమతి వచ్చి ఏమైంది పార్వతి అలా బాధపడుతున్నావ్ కోపంగా ఉన్నావేంటి అని అడుగుతుంది. కోపం ఏమీ లేదు అత్తయ్య అని అంటుంది. బిపి టాబ్లెట్ వేసుకున్నట్లేవు బిపి టాబ్లెట్ తీసుకొని ఇస్తా నాకు అని భానుమతి వెళ్తుంది. అక్కడ చూస్తే మాత్రం బీపి టాబ్లెట్లు ఉండవు. అక్షయ్ కు చెప్పు ఉండొచ్చు కదా అని అంటుంది.. అప్పుడే అక్షయ్ లోపలికి రాగానే ఇంటర్వ్యూ ఏమైంది రా అని పార్వతి అడుగుతుంది. ఆ జాబ్ నాకు రాలేదమ్మా అని అంటాడు. ఇద్దరు కలిసి కమల్ వాళ్ల దగ్గరికి వెళ్లిపోండి అని అక్షయ్ అంటాడు.. కానీ భానుమతి పార్వతీ నువ్వు వెళ్ళు నేను వీడికి తోడుగా ఉంటానని అంటుంది..
Also Read: బాలును బుక్ చేసేందుకు ప్లాన్.. ప్రభావతికి కొత్త టెన్షన్..రోహిణికి షాక్..
ఇంటికొచ్చిన ఆవనీకి భరత్ మౌనంగా బాధపడుతూ ఉండడం చూసి అడుగుతుంది.. అయితే భరత్ ఎంత పిలిచినా పలకకపోవడంతో అవని ఏమైందిరా అని అడుగుతుంది.. ప్రణతి అమ్మ భరత్ ని కొట్టి మరీ అవమానించింది అని చెప్తుంది. అక్కడికి వచ్చిన స్వరాజ్యం నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తే అప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వస్తారని అంటుంది. కానీ అవని మాత్రం తన వాళ్ళే తనకు ముఖ్యమని అంటుంది. కమల్ అక్షయ్ ఇద్దరు తాగేసి ఇంటికి వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..