BigTV English

Bhadrapada Amavasya 2024: భాద్రపద అమావాస్య రోజు ఈ పూజ చేస్తే సంతాన భాగ్యం !

Bhadrapada Amavasya 2024: భాద్రపద అమావాస్య రోజు ఈ పూజ చేస్తే సంతాన భాగ్యం !

Bhadrapada Amavasya 2024: హిందూ ధర్మం ప్రకారం అమావాస్యకు మతపరమైన ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య రోజు సాధారణంగా ప్రజలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. భాద్రపద అమావాస్య ఈ సారి సోమవారం రోజు వస్తుంది. కాబట్టి దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తున్నారు. తమిళనాడులో ఈ రోజును అవని అమావాస్య అని కూడా అంటారు. మార్వాడీలు ఈ రోజును బాధి అమావాస్యగా పిలుస్తుంటారు. ఈ సంవత్సరం సోమవతి అమావాస్య సెప్టెంబర్ 2 వ తేదీన వస్తుంది.


సోమవతి అమావాస్య సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో పుణ్యనదుల్లో స్నానం చేసి తర్పణం చేస్తే పూర్వీకుల అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసాన్ని పాటిసారు. వారి పిల్లల జీవితంలో కూడా ఆనందాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారు. భాద్రపద సోమవతి అమావాస్య రోజు పుణ్యనదుల్లో స్నానం చేసి, దానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారని చెబుతుంటారు.

సోమవతి అమావాస్య తేదీ, ముహూర్తం:
సోమవతి అమావాస్య సెప్టెంబర్ 2, 2024 సోమవారం జరుపుకోనున్నాము. భాద్రపద మాసంలో వచ్చే ఈ అమావాస్య రోజు పూర్వీకులకు శార్థం, తర్పణం, పిండ ప్రధానం చేస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అన్ని బాధలు తొలగిపోతాయి.


సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలి:

  • సోమవతి అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
  • ఈ రోజు పిండి బంతులను తయారు చేసి చేపలు, చీమలకు తినిపించాలి.
  • మర్రి, అరటి, తులసి వంటి చెట్లను నాటడం మంచిది, వీటిలో దేవతలుంటారని హిందువుల నమ్మకం
  • సోమవతి అమావాస్య రోజు ఈ పనులు చేయడం వల్ల పూర్వీకులు ప్రసన్నం అవుతారని విశ్వసిస్తారు.

సోమవతి అమావాస్య పూజా విధానం:
సోమవతి అమావాస్య పూర్వీకులు, శివుని ఆరాధనకు అంకితం చేయబడుతుంది. ఈ రోజు సూర్యోదయానికి ముందే సమాపంలో ఉన్న నదిలో స్నానాలు ఆచరించాలి. ఆ తర్వాత పచ్చిపాలలో పెరుగు, తేనె కలిపి శివుడికి అభిషేకం నిర్వహించాలి. నాలుగు ముఖాల నెయ్యి దీపాన్ని వెలిగించి శివుడి చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల వివాహానికి ఎలాంటి ఇబ్బంది ఉండవు. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది.

 

Related News

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

God Idols: ఇంట్లో ఉంచకూడని దేవుని ఫోటోలు ఏవో తెలుసా..? ఆ తప్పు మీరు అసలు చేయకండి

Big Stories

×