BigTV English
Advertisement

Sheethal Thampi: షూటింగ్ లో ప్రమాదం.. హీరోయిన్ రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నటి

Sheethal Thampi: షూటింగ్ లో ప్రమాదం.. హీరోయిన్ రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నటి

Sheethal Thampi: సాధారణంగా షూటింగ్ లో ప్రమాదం జరగడం చూస్తూనే ఉంటాం. అంతెందుకు ఈ మధ్య రవితేజ కూడా ప్రమాదంలో గాయాలు పాలైన విషయం తెల్సిందే. అయితే.. ప్రమాదంలో గాయపడినందుకు ఒక నటి.. నిర్మాత  రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎక్కడైనా  చూసారా.. ? మలయాళ  నటి శీతల్  తంపి అలాంటి డిమాండే చేసింది.


అసలు విషయంలోకి వెళితే.. మలయాళ హీరోయిన్ మంజు వారియర్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  వరుస సినిమాలతో పాటు నిర్మాతగా కూడా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం మంజు వారియర్ సహా నిర్మాతగా వ్యవరిస్తున్న సినిమా ఫుటేజ్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శీతల్  తంపి కీలక పాత్రలో నటిస్తుంది.

గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శీతల్  తంపి  తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి కారణం.. సెట్ లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని శీతల్  తంపి ఆరోపిస్తుంది.


ప్రమాదం జరిగిన రోజు కనీసం  పక్కన ఆంబులెన్స్ కూడా పెట్టలేదని, దానివలన తాను చాలా ఇబ్బందిపడినట్లు తెలిపింది. అంతేకాకుండా ఆ గాయాల వలన వేరే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని, ఇకముందు తాను నటించేలేనని చెప్పుకొచ్చింది. దీనికి కారణమైన నటి, సహా నిర్మాత మంజు వారియర్ తనకు రూ. 5 కోట్లు నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందుకు సంబందించిన వార్త ప్రస్తుతం మలయాళ చేస్తోంది. మరి ఈ వివాదంపై మంజు వారియర్ ఏమంటుందో చూడాలి.

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×