BigTV English

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఆలీ..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఆలీ..

Comedian Ali: కమెడియన్ ఆలీ ఈ మధ్యనే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలోని ఆలీ సీన్స్ కు  ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బూతులు, వల్గర్ గా మాట్లాడడం తో అసలు ఆ సినిమాలో ఆలీ సీన్స్ ను కట్ చేయమని కూడా డిమాండ్ చేశారు.


ఇక ఈ సినిమా తరువాత ఆలీ.. సరిపోదా శనివారంలో నటిస్తున్నాడు.  నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

ఇక ఈ ఈవెంట్ లో ఆలీ.. పవన్ కళ్యాణ్ ను గుర్తుచేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో నాని వాడిన మూడు వస్తువులను సుమ.. ఆలీకి చూపించి ఒకటి ఎంచుకోవాలని కోరగా..  ఆలీ, ఎర్ర కండువాను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ కలర్ కు చాలా క్రేజ్ ఉంది అని పవన్ కళ్యాణ్ జనసేన ఎర్ర కండువాను గుర్తుచేస్తూ.. పవన్ ను ఇమిటేట్ చేశాడు. ఇక ఎరుపు చూడగానే కోపం.. ఆ కోపం వచ్చినప్పుడు సూర్య ఏం చేసాడు అనేది సినిమాలో చూడాలని ఆలీ చెప్పుకొచ్చాడు.


ఎలాంటి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ ఖ్యాతిని హాలీవుడ్ లో మాట్లాడుకొనేలా చేసిన ఘనత రాజమౌళి గారిది, నిర్మాత దానయ్య గారిది.. ఈ సినిమా కూడా ఆయనకు మంచి విజయాన్ని అందిస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఇక డైరెక్టర్ ఎస్ జె సూర్య.. ఖుషి సినిమా  రోజులను గుర్తుచేశాడు.

నాని ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు.  రాఘవేంద్రరావు గారితో దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. తనలో కూడా ఒక నటుడు ఉన్నాడని గుర్తించి.. తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.   నానికి ఈ సినిమా  మంచి విజయాన్ని అందివ్వాలని కోరుకుంటున్నట్లు ఆలీ తెలిపాడు.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×