Budh Vakri 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని యువరాజు చెబుతుంటారు. బుధుడు తెలివితేటలు, తర్కం, ప్రసంగం, కమ్యూనికేషన్, చర్మం, వ్యాపారానికి కారకంగా పరిగణిస్తారు. మిథున, కన్యా రాశులకు బుధుడు అధిపతి. ఈ రాశుల వారిపై ఎల్లప్పుడూ బుధుడి అనుగ్రహం ఉంటుంది. జాతకంలో బుధగ్రహ ప్రభావం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జాతకంలో బుధుడు బలంగా ఉంటే ఆ రాశులకు చెందిన వ్యక్తులు తెలివైనవాడిగా.. కమ్యూనికేట్ చేయడంలో మంచివాడిగా ఉంటాడు. కానీ పరిస్థితి బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం వ్యక్తి మానసిక సమస్యలను ఎదుర్కొంటాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు సంచారం అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. బుధుడు నవంబర్ 26, 2024న తిరోగమనంలోకి వెళ్లబోతున్నాడు. బుధుడు తిరోగమన దిశలో వృశ్చిక రాశిలో సంచరించనుండగా దీని ప్రభావం ముఖ్యంగా 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది మూడు రాశుల వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ రాశుల వారు ఉద్యోగంలో లాభాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరి సంపద పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారు బుధుడి తిరోగమన సంచారం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది.ఈ రాశి వ్యక్తులు వృత్తి, వ్యాపార, పరీక్షలలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు మీ కష్టానికి సంబంధించిన పూర్తి ఫలితాలను పొందుతారు. అంతే కాకుండా డబ్బు కూడా ఎక్కువగా సంపాదిస్తారు. జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం.. డబ్బు సంపాదించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతే కాకుండా విద్యర్థులకు ఇది చాలా మంచి సమయం. అధికారుల నుంచి మీ పనికి ప్రశంసలు అందుతాయి. వృషభ రాశి వారికి బుధుని తిరోగమనం శుభప్రదం కానుంది. ఈ రాశిలో జన్మించిన డాక్టర్లు, సలహాదారులు, ఉపాధ్యాయులు, కోచ్‌లు, కన్సల్టెంట్లు, న్యాయవాదులు, యాక్టర్లు , వక్తలు శుభప్రయోజనాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఈ కాలంలో మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. మీ ప్రేమ భాగస్వామి నుండి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
సింహ రాశి:
సింహ రాశి వ్యక్తులు బుధుడు తిరోగమన స్థితి నుండి అనుకూల ఫలితాలను పొందుతారు. ఈ వ్యక్తులు వారి ఇంటిని , కుటుంబాన్ని అలంకరించడానికి డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది వారి మనస్సును సంతోషంగా ఉంచుతుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి విలాసవంతమైన జీవితాన్ని గడపడం సులభం అవుతుంది. ఆరోగ్యం , ప్రేమ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
సింహరాశికి మెర్క్యురీ తిరోగమన కదలిక ప్రయోజనకరంగా ఉంటుంది . మీరు మీ కార్యాలయంలో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. ఈ సమయంలో, మీ వ్యాపార సంబంధిత ప్రయాణాలన్నీ లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి , స్థిరాస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
మకర రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకం. మీరు పెట్టుబడి యొక్క ప్రయోజనాలను పొందుతారు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. ఈ సమయంలో, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి లాభధాయకంగా ఉంటుంది. మీరు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ వైవాహిక జీవిత సంతోషంగా ఉంటుంది. ఆర్ధిర విషయాల పట్ల ఆలోచించి నిర్ణయాలన్ని తీసుకోండి.
Also Read: నవంబర్ 22 న కాలబైరవ పూజ చేస్తే.. నరదిష్టి పోతుంది
1. ‘ఓం బ్రాం బ్రీం బ్రౌం స: బుధై నమః’ ఈ మహామంత్రం పఠించడం ద్వారా మరింత అనుగ్రహాన్ని పొందుతారు.
2. ప్రియంగుకలికశ్యాం రూపేణప్రతిం బుధమ్.
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥