BigTV English

Cat:పిల్లి ఇంటికి ప్లస్ పాయింటే అవుతుందా…..

Cat:పిల్లి ఇంటికి ప్లస్ పాయింటే అవుతుందా…..

Cat:పొద్దునే లేచిన వెంటనే పిల్లి ముఖం చూస్తే ఇక అంతే అన్న ఆచారం గతంలో బాగా ఉండేది. పాత రోజుల్లో పిల్లి శకునాన్ని అరిష్టంగా , చెడ్డదిగా భావించే వారు. ఇప్పుడు ట్రండ్ మారింది. పిల్లుల్ని ఇష్టంగా ఇంట్లోనే పెంచుకునే రోజులు . కొన్ని దేశాల్లో పిల్లి ఎదురైతే మంచి జరుగుతుందని భావించే వారు లేకపోలేదు. పిల్లులకు గుడి కట్టి మరీ పూజించే వారు కూడా ఉన్నారు. కానీ మనదేశంలో పిల్లి ఎదురైతే అపశకునం అని భావిస్తారు.


పిల్లుల్ని పెంపుడు జంతువులుగా ఇంట్లో ఉంచుకోవడం ఎల్లప్పుడూ మిశ్రమంగా ఉంది. వాస్తు ప్రకారం, పిల్లులు లక్ష్మీ దేవిని సూచిస్తాయి, ఇది సంపద మరియు సంపద యొక్క దేవత. పిల్లులు అత్యంత ఆప్యాయత మరియు తెలివైన జంతువులు. ఆగ్నేయ దిశతో సంబంధం ఉన్న దోషాలను తగ్గించడానికి పిల్లులను పెంపుడు జంతువులుగా ఉంచడం లేదా వాటికి ఆహారం ఇవ్వడం వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంటికి వాస్తు జంతువులుగా పిల్లులు ఇంటిలోని మహిళా సభ్యుల మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. పిల్లులు లక్ష్మీ దేవితో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి, అవి సంపద డబ్బును తీసుకువస్తాయని చెబుతారు.

ఎవరైనా ఇళ్లల్లో పిల్లులను పెంచుకుంటే, అవి కుక్కలాగా విశ్వాసాన్ని చూపించే జంతువులు కాదనే విషయాన్ని గుర్తించాలి. గతంలో పిల్లులను వ్యవసాయం ఎక్కువగా చేసుకునే ఇళ్లలో పెంచేవారు. అందుకు కారణం లేకపోలేదు. వ్యవసాయం చేసే వారి ఇళ్ళల్లో వడ్ల బస్తాలు ఉండటంవల్ల, ధాన్యం తినడం కోసం ఎలుకలు చేరుతాయి. ఈ ఎలుకల బారి నుండి ధాన్యాన్ని రక్షించుకోవడం కోసం గతంలో ఇళ్లల్లో పిల్లులను పెంచేవారు.


Related News

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Big Stories

×