BigTV English

Red river: భయపెడుతున్న ఎర్రనది.. రక్తంలా పారుతున్న నీరు

Red river: భయపెడుతున్న ఎర్రనది.. రక్తంలా పారుతున్న నీరు

Red river: సాధారణంగా కొందరు ఎరుపు రంగును చూస్తేనే భయపడిపోతారు. రక్తాన్ని చూస్తే.. దెబ్బకు కళ్లు తిరిగి పడిపోతారు. అలాంటి వారు ఈ నదిని చూస్తే… ఇక అంతే సంగతి. దెబ్బకు భయంతో పరుగులు తీస్తారు. ఎందుకంటే నదిలోని నీరు మొత్తం ఎరుపు రంగులో రక్తంలా ఉంటుంది కాబట్టి. చూడడానికి రక్తం ఏరులై పారుతున్నట్లుగా భయంకరంగా ఉంటుంది ఈ నది. అలాగే నది పారుతున్నప్పుడు వచ్చే శబ్దాలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి.


ఆ నది ఎక్కడుందంటే?

ఈ నది అమెరికా క్యాలిఫోర్నియాలోని కుస్కోకు సమీపంలో ఉంటుంది. అండీస్ పర్వత శ్రేణులు, పాల్కోయో రెయిన్‌బో వ్యాలీల మధ్యలో నుంచి ఈ నది ప్రవహిస్తుంది. ప్రతి ఏటా ఈ నదిని చూడటానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కుస్కోలో వర్షాకాలం కాబట్టి. ఇక ఎండా కాలంలో ఈ నదిలోని నీరు గోధుమ రంగులో ఉంటుంది. ఈ నది వద్దకు వెళ్లాలంటే కుస్కో నుంచి ప్రతి 20 నిమిషాలకు బస్సులు ఉంటాయి. అలాగే ప్రైవేట్ వాహనాలు, టూరిస్టు గైడులు కూడా ఉంటారు.


నీరు ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది..

చూడడానికి భయంకరంగా ఆ నదిలోని నీరు ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. నీరు ఎరుపు రంగులో ఉండటానికి కారణం చుట్టు పక్కల ఉన్న పర్వతాలే.. ఆ పర్వతాలపై ఐరన్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో నీటితో పాటు ఐరన్ ఆక్సైడ్ కొట్టుకువచ్చి నదిలో కలవడం వలన నీరు ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే కాలాన్ని బట్టి నీరు కొన్నిసార్లు గులాబీ రంగులోకి, గోధుమ రంగులోకి మారుతుంటుంది.

ప్రస్తుతం కుస్కోలో వర్షాకాలం కాబట్టి నదిలోని నీరు పూర్తిగా ఎరుపు రంగులోకి మారి గళగళా ప్రవహిస్తుంది. నదిని చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడి చేరుకుంటున్నారు. నదికి సంబంధించిన దృష్యాలను కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

https://twitter.com/Weirdndterrible/status/1627642418903543808?s=20

Tags

Related News

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Big Stories

×