బాల్కనీలో కుండీల్లో మొక్కలు పెంచితే ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక పెరడు ఉన్నవారు రకరకాల చెట్లను, మొక్కలను పెంచుకోవచ్చు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచవచ్చు. కానీ కొన్నింటిని పెంచకూడదు. అన్ని మొక్కలు శుభ్రమైనవి కాదు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం గోరింట మొక్కను ఇంటి పెరట్లో లేదా ఇంటిముందు ఇంటి బాల్కనీలో పెంచవచ్చో లేదో తెలుసుకోండి.
హిందూ మతంలో గోరింటాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కర్వాచౌత్, దసరా, దీపావళి, సంక్రాంతి సమయాల్లో చేతికి గోరింటాకును పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఆషాడమాసంలో కూడా గోరింటాకును అమ్మాయిలు పెట్టుకుంటారు. అలాగే పెళ్లి సమయంలో గోరింటాకును కూడా పెళ్లి వస్తువుల్లో భాగంగా ఇవ్వడం సంప్రదాయంగా మారింది. గోరింటాకు పెట్టుకోవడం అనేది శుభం, ఆనందానికి చిహ్నంగా చెప్పుకుంటారు.
గోరింటాకు మంచిది కాదా?
వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి గోరింట మొక్కను ఇంట్లో నాటడం శుభప్రదం అని అందరూ అనుకుంటారు. నిజానికి ఇంట్లో కానీ, ఇంటి ముందు కానీ, బాల్కనీలో కానీ గోరింటాకు మొక్కను పెంచడం శుభప్రదం కాదు. ఆ మొక్కలో ప్రతికూలతలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ మొక్కను ఎక్కడ నాటితే అక్కడ ప్రతికూల శక్తి ప్రవహిస్తుందని ఆ ఇంటి ఆనందాన్ని, శాంతిని, శ్రేయస్సును తగ్గిస్తుందని అంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం గోరింట మొక్క ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లో అశాంతి, పనుల్లో ఆటంకాలను పెంచుతుంది. గోరింట మొక్కను నాటడం వల్ల ఇంటి వాస్తు సమతుల్యతను కూడా దెబ్బతింటుంది. ఇంటి లోపల వెలుపల బాల్కనీలో ఎక్కడ కూడా గోరింట మొక్కను ఉంచడం మంచిది కాదు.
ఈ మొక్కలు ఉండకూడదు
కేవలం గోరింట మొక్కే కాదు పత్తి మొక్క, చింత మొక్క వంటివి కూడా ప్రతికూల శక్తులను ఉత్పత్తి చేస్తాయి. అవి ఇంట్లో సానుకూల శక్తిని తగ్గించేస్తాయి. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం మీరు గోరింట మొక్కను మీ ఇంటి చుట్టుపక్కల లేకుండా చూసుకోండి.
మీకు మొక్కలు పెంచాలనిపిస్తే కొన్ని మొక్కలు ఇంటికి శుభాన్ని తెస్తాయి. అందులో తులసి, మనీ ప్లాంట్, అశోక చెట్టు వంటివి మంచివి. వీటిని ఈశాన్యం లేదా తూర్పు దిశలో నాటడం వల్ల వాస్తు దోషాలు చాలా వరకు తొలగిపోతాయి. గోరింటాకు మొక్కకు బదులుగా ఇలాంటి వాటిని పెంచుకోవడం వల్ల మీ ఇంటి అందం పెరగడమే కాదు. ఇంట్లో వారికి శక్తి సామర్ధ్యాలు వస్తాయి. వారికి విజయాలు దక్కుతాయి.