Naga Chaitanya About His Dream Projects: అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్తో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు వరుస ప్లాప్స్ చూసిన నాగ చైతన్య.. లాంగ్ గ్యాప్ తర్వాత తండేల్తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. తండేల్తో 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ సినిమా హిట్తో ఫుల్ జోష్‌లో ఉన్న చై ఇక పాన్ ఇండియా సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య 24వ చిత్రమిది.
NC24 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు వృషకర్మ అని టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. SVCC బ్యానర్లో బీవీఎస్ఎన్, సుకుమార్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్నిన నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తో చై తాజాగా ఓ టాక్ షోలో పాల్గోని ఆసక్తికర విషయాలు చెప్పాడు. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న టాక్ షోకి చై స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ సందర్భంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తనకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్, ఆనందాన్ని ఇచ్చేది రేసింగ్ అని చెప్పాడు. పిచ్చిపిచ్చిగా బైక్ రైడ్ చేసేవాడిని. ఆ వయసులో అసలు భయం ఉండదు. లైఫ్ అంటే తెలియదు. ప్రమాదాలు జరిగాయి కానీ, ఎప్పుడు భయపడదు. అప్పుడు అలా అనిపించేది. కానీ, బైక్ రైడ్స్ అంటే లైఫ్ని రిస్క్ చేయడమే. తర్వాత అది అర్థమై కార్ రేసింగ్‌కి వెళ్లాను. నాకు చేయాలని అనిపించినప్పుడ ట్రాక్ వెళ్లి కార్ రేసింగ్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. కానీ, మళ్లీ రోడ్పై మాత్రం రూల్స్ పాటిస్తూనే డ్రైవ్ చేస్తానని చెప్పాడు. ఇటూ అక్కినేని, అటూ దగ్గుబాటి ఇంటి పేరును నిలబెట్టడం నిజంగా తనకిది పెద్ద సవాలుగా ఉందన్నాడు. ఈ రెండు కుటుంబాల్లో ఒక మెంబర్గా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పుకొచ్చాడు.
Also Read: SS Thaman: సచిన్తో తమన్ వర్క్.. ఆ ట్వీట్ అర్థమేంటి భయ్యా!
ఆ తర్వాత తన సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో తన తండ్రిని(అక్కినేని నాగార్జున) ఫాలో అవుతానన్నాడు. నాన్నలాగా మైథలాజికల్ చిత్రాలు చేయాలని ఉంది. నా కెరీర్లో ఎప్పటికైనా అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలు చేయాలనేది తన కోరిక అంటూ మనసులో మాట భయటపెట్టాడు. ప్రస్తుతం చై కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. కాగా మొదటి నుంచి నాగ చైతన్య లవర్ బాయ్ రోల్స్ చేస్తూనే వస్తున్నాడు. లవ్ రోమాంటిక్ చిత్రాలతో యూత్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఏం మాయ చేసావే సినిమాతో చైకి లవ్స్టోరీలో ట్రెండ్ సెట్ చేశాడు. 100% లవ్, మజిలి, లవ్స్టోరీ, రీసెంట్ గా తండేల్తో ఇలా ఎన్నో లవ్ ఎంటర్టైన్ సినిమాలు చేసిన చై మైథలాజికల్ సినిమాలు చేయాలని ఉందనడం అందరికి షాకిస్తుంది.