Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సోమవారం అనూహ్య ఘటన జరిగింది. ఓ కేసు విచారణపై వాదనలు జరుగుతున్న సమయంలో సీజేఐ డెస్క్ వద్దకు వెళ్లారు సదరు లాయర్. సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. వెంటనే గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడ్ని అడ్డుకున్నారు. ఆ వ్యక్తి కూడా అడ్వకేట్.
అసలు కేసు ఏంటి?
ఈ ఘటనపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని తేల్చిచెప్పారు. ఆ తర్వాత విచారణను కొనసాగించారు. ఘటనకు కారణమైన న్యాయవాదిని పోలీసులు న్యాయస్థానం లోపల అదుపులోకి తీసుకున్నట్లు విచారణ చేపట్టారు. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ కోర్టు లోపల న్యాయవాది నినాదాలు చేశారు. బూటు విసిరిన లాయర్ పేరు కిశోర్ రాకేశ్, అతడ్ని అరెస్ట్ చేశారు.
2011 నుండి సుప్రీంకోర్టు బార్‌లో రిజిస్టర్ అయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించడం గురించి CJI గవాయ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది కోపంగా ఉన్నాడని కోర్టు వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 16న విరిగిన విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను CJI తోసిపుచ్చారు. వెళ్లి దేవుడిని మీరే చేయమని అడగండి అని అన్నారు.
పిటిషన్ కొట్టివేయడమే కారణమా?
విగ్రహం ప్రస్తుత స్థితిలో ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని వామన్ ఆలయంలో 7 అడుగుల విష్ణువు విగ్రహం విరిగింది. దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సెప్టెంబర్ 16న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయంపై పిటిషనర్ నిరాశ వ్యక్తం చేశారు.
ఇది ముమ్మాటికీ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. పూజలు చేయాలనుకునే భక్తులు ఇతర దేవాలయాలను సందర్శించవచ్చన్నవారు. మొఘల్ దండయాత్రల సమయంలో విగ్రహం డ్యామేజ్ అయ్యిందని, అప్పటి నుండి అది విరిగిపోయి ఉందన్నది పిటిషనర్ వాదన. భక్తుల హక్కును కాపాడటానికి, ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి కోర్టు జోక్యం చేసుకోవాలని వారు కోరారు.
ALSO READ: డార్జిలింగ్ పై ప్రకృతి కన్నెర, 28 మందిని మింగేసిన కొండచరియలు
రెండు రోజుల తర్వాత ఓపెన్ కోర్టు ఈ వివాదాన్ని ప్రస్తావించారు సీజేఐ. సెప్టెంబర్ 18న తన వ్యాఖ్యలను సోషల్‌మీడియాలో తప్పుగా వక్రీకరించారని, తాను అన్ని మతాలను గౌరవిస్తానని నొక్కి వక్కానించారు సీజేఐ. ధర్మాసనంలో భాగమైన మరో న్యాయమూర్తిని ఆన్‌లైన్‌లో తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు కొందరు. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నోరువిప్పారు. సోషల్ మీడియాలో కొన్ని విషయాలు అతిగా ప్రచురితమవుతాయని చెప్పిన విషయం తెల్సిందే.