BigTV English

Favorite Color : మీరు ఇష్టపడే రంగు బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చా….

Favorite Color : మీరు ఇష్టపడే రంగు బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చా….


Favorite Color : ఇంద్రధనస్సులోని ఏడురంగులు ఉన్నా అన్నీ రంగులు అందరికి ఇష్టం ఉండాలన్న రూల్ ఏమీ లేదు. ఒక్కోక్కరికి ఒక్కో కలర్ పై ఇష్టం మొదలవుతుంది. ఒకరికి ఎరుపుంటే వల్లమాలిన అభిమానం. మరొకరికి బ్లూ అంటే పడి చచ్చిపోతుంటారు. నచ్చిన వాహనం నుంచి వేసుకునే బట్టల వరకు ఈ కలర్ నే ఎంచుకుంటారు. మరికొందరి పసుపు అంటే ప్రేమ. ఇంకొదరికి పచ్చ రంగును ప్రేమగా చూసుకుంటారు. ఎవరి ఇష్టం వారిది అయినా.. వారు ఎంచుకునే రంగులు బట్టి వారి మనస్తత్వాన్ని గుర్తించువచ్చు. అలాగే జాతక రిత్యాకూడా ఎవరికి ఏ రంగు నంపుతుతుందో జ్యోతిష్యశాస్త్రం కూడా చెబుతోంది.

ఎరుపు రంగు ఇష్టపడేవాళ్లకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ మైండ్ తో ఉంటారు. ఏ విషయంలోనైనా ధైర్యంగా ఉంటారు. మనసులో ఏది ఉన్నా బయటపెడతారు. ఏవిషయాన్ని ఎవరితో అయినా ముఖం మీదే చెప్పేస్తారు. ఏ పని చేసినా వంద శాతం కష్టపడే తత్వం వీరి నైజం. కాషాయ రంగు ఇష్టపడే వాళ్లకి సహనంగా ఎక్కువ. అందరితో స్నేహపూర్వకంగా ఉండేందుకు ఇష్టపడతారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతారు. కలుపుగోలుగా ఉంటూ స్నేహభావంతో ఉంటారు. పసుపు రంగు ఇష్టపడేవాళ్ల ఎనర్జీటిక్ గా ఉంటారు. నిత్యం ఉత్సాహంతో కనిపిస్తారు. రొటీన్ గా ఆలోచించడం అంటే వీళ్లకి ఇష్టం ఉండదు. భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు. గ్రీన్ కలర్ ఇష్టపడే వాళ్లు దయాగుణం ఎక్కువగా ఉంటుంది. పరోపకారం చేస్తుంటారు. ఇతరులు కష్టాల్లో ఉంటే వీలైన సాయం చేస్తుంటారు. బ్లూ కలర్ ఇష్టపడేవాళ్ల అత్యంత నమ్మకస్తులు. వీళ్లకి మోసం చేయడం రాదు. ఎవరినైనా నమ్మితే వారితో జీవితాంతం ఉంటారు. అన్ని విషయాల్లోను అందరి పట్ల నమ్మకంతో ఉంటారు.


గులాబీరంగు అంటే ఇష్టం ఉన్న వాళ్లు ఇతరుల్ని బాగా ప్రేమిస్తారు. ఇతరుల అవసరాలను సరిగ్గా గుర్తించగలుగుతారు. మృదు స్వభావం కలిగి ఉంటారు.బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్లు శ్రమకి తగ్గ ఫలితాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈరంగు ఇష్టపడే వాళ్లలో ఎక్కువమంది తెలియకుండానే అప్పులూ చేసే రకం వాళ్లు ఉంటారు. కుటుంబ సభ్యులతో విరోధాన్ని కూడా అప్పుడప్పుడూ పెంచుకుంటూ ఉంటారు. జీవితంలో తరచూ వివాదాలకు లోనవుతూ ఉంటారు. ఎన్ని జరిగినా మారిపోయే రకంగా కాదు వీళ్లు మిశ్రమ రంగుల్ని ఇష్టపడే వారు సాత్వికంగా ఉంటారు. సాధు గుణమైన మనస్థ్వతంలో జీవిస్తుంటారు. భక్తి ప్రపంచంలో మునిగిపోవాలనుకుంటారు. ఆధ్యాత్మిక జీవనాన్ని కోరుకుంటూ ఉంటారు.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×