Habits of Wife: భార్యలకు ఉండే కొన్ని అలవాట్లే భర్తల జీవితాలను నాశనం చేస్తున్నాయట. కేవలం భర్తల జీవితాలే కాకుండా ఇరు కుటుంబాలు ఆ అలవాట్ల వల్ల కష్టాలు పడాల్సి వస్తుందట. తర్వాత భార్యలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. అయితే కొన్ని సందర్భాలలో భార్యలు ఆ తప్పులు తెలియకుండానే చేస్తుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా దాని వల్ల నష్టపోయేది రెండు జీవితాలే కాదు రెండు కుంటుంబాలు కూడా అంటున్నారు. అయితే భార్యలు చేసే ఆ తప్పులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వివాహ వ్యవస్థ బలంగా ఉన్న మన భారతీయ కుటుంబాల్లో భార్యలు చేసే చిన్న చిన్న పొరపాట్లే వివాహ వ్యవస్థనే సవాల్ చేసే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు పండితులు. శాస్త్రం ప్రకారం భార్యలు ఇంతకు ముందు లాగా ఉండటం లేదని ఇప్పుడు అధునిక పోకడల కారణంగా కాపురాలు నాశనం చేసుకుంటున్నారని చెప్తున్నారు. అయితే భార్యలు తమలో చిన్న చిన్న పొరపాట్లను మార్చుకుంటే వారి జీవితాలు హ్యపీగా ఉంటాయంటున్నారు. ఆ పొరపాట్లేవో ఇప్పడు తెలుసుకుందాం.
భర్తతో వాదించడం: ప్రతి విషయానికి భర్తతో వాదించడం అనేది భార్యలు చేసే పెద్ద తప్పు అంటున్నారు. దీని వల్ల భర్త మనసు విరిగిపోతుందట. అంత వరకు భార్య మీద ఉన్న ప్రేమ లేకుండా పోతుందట. అందుకే భార్యలు ప్రతి దానికి వాదించడం మానుకోవాలని.. భర్తను అర్థం చేసుకోవాలని భర్త మాటలకు విలువ ఇవ్వాలని సూచిస్తున్నారు.
అత్త మామలతో గొడవ: ఇక చాలా మంది భార్యలకు నచ్చనిది అత్తమామలు. వాళ్లు ఇంట్లో ఉంటే ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. వారిని ఎప్పుడు కొడుకుకు దూరం చేయాలనే ఆలోచిస్తుంటారు. అలా కాకుండా అత్తా మామలు కనిపించే తల్లిదండ్రులుగా భావించాలి. అప్పుడే ఇంట్లో ఏ గొడవ ఉండదని చెప్తున్నారు.
అనవసరమైన వాదనలు: ఇక భార్య ఇంట్లో వాళ్లతో కారణం లేకుండా గొడవ పెట్టుకోవడం. భర్త, అత్తమామలు, ఆడపడచులతో గొడవ పడటం లాంటివి చేయకూడదు. ఇంకా కొంత మంది ఇంటి పక్కల వారితో.. చుట్టు పక్కల వారితో కారణం లేకుండా గొడవ పడుతుంటారు. దీంతో ఆ వీధలో కానీ, ఇంటి చుట్టు పక్కల కానీ వారికి గౌరవం లేకుండా పోతుంది.
భర్త చెప్పేదాన్ని వినకపోవడం: ప్రతి విషయంలో భర్త మాటకు విలువ ఇవ్వకపోవడం అలాగే భర్త చెప్పే ఏ విషయాన్ని కూడా వినకుండా ఎవైడ్ చేయడం. భర్త మాటలు పూర్తిగా వినకుండానే ఆయన చేసిన పనుల్లో తప్పు పట్టడం. ఇంకా భర్తను అవహేళనగా మాట్లాడటం. ఇంకా తన పుట్టింటి వాళ్లకు తల్లిదంద్రుల ముందు తన భర్త గురించి తక్కువగా మాట్లాడటం. అసలు భర్తకు గౌరవం ఇవ్వకపోవడం.
ఇలాంటి అలావాట్లు ఉన్న భార్య వల్ల ఆ భర్తకు మనః శాంతి ఉండదట. దీంతో ఆయన జీవితంలో అభివృద్ది సాధించడానికి బదులు మానసికంగా కుంగిపోవడంతో ఆ భర్త జీవితం నాశనం అవుతుందట.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?