BigTV English

Akhil Zainab wedding: జైనాబ్ తో అఖిల్ వివాహం.. వేలకోట్లకు అధిపతి.. నాగ్ ప్లాన్ మామూలుగా లేదే?

Akhil Zainab wedding: జైనాబ్ తో అఖిల్ వివాహం.. వేలకోట్లకు అధిపతి.. నాగ్ ప్లాన్ మామూలుగా లేదే?

Akhil Zainab wedding: అక్కినేని వారసుడు అఖిల్ తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలుకుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్ (Akhil)నేడు (శుక్రవారం) ఉదయం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తాను ప్రేమించిన అమ్మాయి జైనాబ్(Zainab) మెడలో మూడు ముళ్ళు వేసి తనతో ఏడడుగులు నడిచారు. ఇలా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా అఖిల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అఖిల్ పెళ్లి చేసుకున్న అమ్మాయి జైనాబ్ ఎవరు? ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి? అఖిల్ తో తన పరిచయం ఎలా జరిగింది అనే విషయాల గురించి ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.


జేఆర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్…

జైనాబ్ ప్రముఖ వ్యాపారవేత్త జేఆర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జుల్ఫీ రావ్‌జీ కుమార్తె . ఈమె హైదరాబాద్లో పుట్టినప్పటికీ వ్యాపారాల నిమిత్తం తల్లితండ్రులు ముంబై షిఫ్ట్ అవడంతో అక్కడే చదువులు పూర్తి చేసుకున్నారు. ఇక జైనాబ్ కు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం.దేశంలోని వివిధ నగరాలతో పాటు దుబాయ్, లండన్‌లోనూ తన ఆర్ట్ వర్క్ ఎగ్జిబిషన్స్‌ ద్వారా ప్రజలకు చూపించారు. అయితే జైనాబ్ రానా భార్య మిహీకా మంచి స్నేహితులని తెలుస్తుంది.


ఫ్యామిలీ ఫ్రెండ్స్..

ఓసారి లండన్ లో తన ఆర్ట్ వర్క్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో భాగంగా అక్కినేని కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో అఖిల్ తో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది. మరోవైపు జైనాబ్ తండ్రి జుల్ఫీ రావ్‌జీ ఎన్నో వ్యాపారాలను చూసుకుంటూ రియల్ ఎస్టేట్ కూడా నడుపుతా వచ్చారు. ఇలా రియల్ ఎస్టేట్ గా నాగార్జునకు మంచి స్నేహితుడు అయ్యారు. ఇక ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ హోదా పదవి కూడా చేపట్టారు. ఇటు రాజకీయాల పరంగా అటు వ్యాపారాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న జుల్ఫీ రావ్‌జీ నాగార్జునకు ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో అఖిల్ జైనాబ్ మధ్య కూడా పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరి వివాహం జరిగిందని తెలుస్తోంది.

జుల్ఫీ రావ్‌జీ వ్యాపార రంగంలో కొనసాగుతూ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది. ఈయనకు ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా పలు వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తన కూతురిని అక్కినేని అఖిల్ కి ఇచ్చే వివాహం చేయడంతో తన ఆస్తులు అన్నింటికీ అఖిల్ వారసుడిగా మారిపోయారు.. ఇలా జైనాబ్ మెడలో మూడు ముళ్ళు వేయడంతో అఖిల్ కొన్ని వేల కోట్లకు అధిపతిగా మారిపోయారు. ఇక అఖిల్ విషయానికొస్తే ప్రస్తుతం ఈయన సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన అఖిల్ ఏ ఒక్క సినిమా ద్వారా సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక చివరిగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం 3 పెద్ద ప్రాజెక్టులతో అఖిల్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. మరి పెళ్లి తర్వాత ఆయన అఖిల్ కెరియర్ పరంగా సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×