E-Paper
Advertisement

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?
Advertisement

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు, నిర్మాణాలకు దిశలు నిర్ణయించబడ్డాయి. వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను సరైన దిశలో ఉంచినట్లయితే, ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా ఇంట్లోని కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం పెడితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అంతే కాకుండా సంపదకు కూడా లోటు ఉండదు. ఇదిలా ఉంటే చనిపోయిన వారికి గుర్తుగా మనం వారి ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటాం. మరి ఈ ఫొటోలను కూడా ఇంట్లో పెట్టుకునేందుకు వాస్తు టిప్స్ పాటించాలి. ముఖ్యంగా పూర్వీకుల ఫొటోలను వాస్తు ప్రకారం పెట్టకపోతే అశుభం కలుగుతుందని చెబుతుంటారు. మరి వాస్తు ప్రకారం ఇంట్లో పూర్వీకుల ఫొటోలను ఏ దిశలో ఉంచాలి. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పితృ పక్షం 17 సెప్టెంబర్ 2024 మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఇది బుధవారం అక్టోబర్ 2, 2024న ముగుస్తుంది. పితృ పక్షం సమయంలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం పిండ ప్రధానం చేస్తారు. ఇదే కాకుండా.. పూర్వీకుల ఆనందంతో కూడా కొన్ని విషయాలు ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు, పితృపక్షంలో ఇంట్లో పూర్వీకుల ఫొటోను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం.

Advertisement

Also Read: ప్రతి రోజు ఉదయం ఇలా చేస్తే.. మీ ఇంట్లో డబ్బుకు లోటుండదు

ఇంట్లో పూర్వీకుల ఫొటోను ఉంచడానికి సరైన దిశ..

Advertisement

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పూర్వీకుల చిత్రాలను ఉంచడానికి దక్షిణ దిశ అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దక్షిణ దిశను యముడి దిక్కుగా పరిగణిస్తారు. చనిపోయిన పూర్వీకుల ఫొటోలను దక్షిణ దిశలో పెట్టడానికి కారణం కూడా ఇదే. కొందరు ఇంటి పూజ గదిలో కూడా పూర్వీకుల ఫొటోలను పెడతారు. పొరపాటున కూడా పూర్వీకుల ఫొటోలు ఇలా పెట్టకండి.

మీ పూర్వీకుల ఫొటో పాతది అయినప్పటికీ, అది ముక్కలుగా ఉండకూడదు. పూర్వీకుల ఫొటోలను ఫ్రేమ్ చేసి మాత్రమే ఇంట్లో ఉంచండి. అలాగే ఫొటోలపై తెగిన లేదా పాడైన దండలను ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ పూర్వీకుల ఫొటోలు కూడా ఉండకూడదు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×