Astro Tips For Money: హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ దేవి సంపద, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తికి జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని రకాల పరిహారాలు చేయాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మరోవైపు, లక్ష్మీ దేవి కోపంగా ఉంటే, వ్యక్తి పేదవాడు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. మత విశ్వాసాల ప్రకారం, ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా అనుసరించాల్సిన అనేక పనులు ఉన్నాయి. వాటితో లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.
పరిశుభ్రత: లక్ష్మీదేవికి పరిశుభ్రంగా అంటే చాలా ఇష్టం. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతుంటారు. అందుకే ఇంటి ప్రధాన తలుపును క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి, ఎందుకంటే ఈ తలుపుల నుండి లక్ష్మీ దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఇళ్లు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లోకి లక్ష్మీ దేవి ప్రవేశిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో డబ్బు నిలవడానికి ఇళ్లును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మవారిని పూజించే చోట మాత్రమే తల్లి కృప వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది.
దీపం వెలిగించడం: ప్రతి రోజు సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముఖద్వారం వద్ద తప్పకుండా దీపం వెలిగించాలి. ఇది కుటుంబంలో శ్రేయస్సును పెంచుతుంది. అంతే కాకుండా డబ్బు నిలవ ఉండేలా చేస్తుంది. ఇంట్లో డబ్బు నిలవడం లేదు అనుకునే వారు లక్ష్మీ దేవిని శుక్రవారం రోజు పూజిస్తే డబ్బులు నిలువ ఉంటాయి. దేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది.
సూర్యుడి పూజ: సూర్య భగవానుడికి క్రమం తప్పకుండా ఉదయం నీటిని సమర్పించడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తుంది. అలాగే మీ జాతకంలో సూర్యుడి స్థానం కూడా బలపడుతుంది. ఇది సంపదను పెంచుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం సూర్యుడిని పూజించాలి.
Also Read: పితృపక్షంలో ఈ పరిహారాలు చేస్తే మీ పూర్వికులు సంతోషిస్తారు.
తులసి పూజ: ప్రతి ఇంట్లో తప్పకుండా తులసి చెట్టు ఉండాలి. నిత్యం తులసి పూజ జరిగే ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుంది. తులసికి నీటిని సమర్పించి దీపం వెలిగించండి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల లక్ష్మీ దేవి సంపదను పెంచుతుంది.
తిలకం: ప్రతి వ్యక్తి రోజు ఉదయం పూజ తర్వాత నుదుటిపై తిలకం పెట్టుకోవాలి. ఇది శారీరక , మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కాకుండా సంపదను పెంచుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)