EPAPER

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Donkey Milk Business: అందరూ నడిచే దారిలో మనం నడిస్తే మజా ఏం ఉంటుంది? అందరూ చేసే బిజినెస్ మనం చేస్తే మనకు ప్రత్యేకత ఏం ఉంటుంది? ఏ పని అయినా కొత్తగా చేయాలి. సక్సెస్ సాధించాలి. అప్పుడే మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అచ్చంగా ఇలాగే ఆలోచించాడు గుజరాత్ కు చెందిన ధీరేన్ సోలంకి. అహ్మదాబాద్ కు చెందిన ఈ యువకుడు కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టాలని చాలా రోజులు ఆలోచించాడు. ఎంతో మంది సలహాలు తీసుకున్నాడు. చివరకు గాడిద పాల ఆలోచన వచ్చింది. పోటీలేని రంగం కావడంతో కచ్చితంగా సక్సెస్ అవుతానని బలంగా నమ్మాడు.


20 గాడిదలతో వ్యాపారం మొదలు

గాడిద పాల వ్యాపారం గురించి లోతుగా అధ్యయనం చేశాడు ధీరేన్. సౌత్ ఇండియాలో కొంత మంది ఈ బిజినెస్ చేస్తున్నట్లు తెలుసుకుని వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నాడు. సుమారు 22 లక్షల పెట్టుబడితో 20 గాడిదలతో డాంకీ ఫామ్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఆయన ఫామ్ లో 42 గాడిదలు ఉన్నాయి. లీటరు గాడిద పాలను రూ. 5 నుంచి రూ. 7 వేల వరకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాలోని పలు రాష్ట్రాలకు తన ఫామ్ నుంచి పాలు సరఫరా చేస్తున్నాడు. నెలకు రూ. 3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు ధీరేన్.


ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం

ధీరేన్ సోలంకికి మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ ఉండేది. కానీ, ఎంత ప్రయత్నించినా రాలేదు. కొన్ని ప్రైవేట్ కంపెనీలలో పని చేశాడు. కానీ, అక్కడ ఇచ్చే సాలరీ ఇంటి ఖర్చులకు కూడా సరిపోయేది కాదు. ఆ సమయంలోనే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చింది. నెట్ లో సెర్చ్ చేసి, గాడిద పాల వ్యాపారం లాభసాటిగా ఉందని తెలుసుకున్నాడు. అప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న కొంత మంది కలిసి మంచి చెడులు తెలుసుకున్నాడు. సుమారు 8 నెలల క్రితం తన వ్యవసాయ పొలంలో గాడిదల ఫామ్ ఏర్పాటు చేశారు. సుమారు రూ. 22 లక్షల ఖర్చుతో 20 గాడిదలతో ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.

తొలి 5 నెలలు ఎన్నో ఇబ్బందులు

గాడిద ఫామ్ మొదలు పెట్టిన తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాడు ధీరేన్ సోలంకి. గుజరాత్ లో గాడిద పాలకు పెద్దగా గిరాకీ లేదు. 5 నెలల పాటు పెట్టుబడి తప్ప పైసా ఆదాయం లేదు. నెమ్మదిగా గాడిద పాలు కొనుగోలు చేసే కంపెనీలతో జతకట్టాడు. ఇప్పుడు ఆయన ఫామ్ నుంచి వస్తున్న గాడిద పాలను కర్నాటకతో పాటు కేరళ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు. పలు కాస్మోటిక్ కంపెనీలు కూడా ఆయన ఫామ్ నుంచి గాడిద పాలను కొనుగోలు చేస్తున్నాయి. లీటర్ గాడిద పాల ధర రూ. 5 నుంచి రూ. 7 వేల వరకు ఉంటుందని చెప్పాడు ధీరేన్. గాడిదపాలను పొడి చేసి కూడా అమ్ముతున్నట్లు వెల్లడించాడు. కిలో గాడిద పాల పొడి ధర రూ. 1 లక్ష ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు గాడిదల పెంపకానికి ప్రోత్సాహకాలు అందిస్తే చాలా మందికి స్వయం ఉపాధి కలుగుతుందంటున్నాడు సోలంకి.

గాడిద పాలకు ఎందుకు అంత ధర?

పురాతన కాలం నుంచి గాడిద పాలను వినియోగించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఈజిప్టు రాణి క్లియోపాత్రా తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు గాడిదపాలలో స్నానం చేసేదని పలు పుస్తకాలు వెల్లడిస్తున్నాయి. వైద్య పితామహును, ప్రముఖ గ్రీకు వైద్యుడు హిప్పోక్రేట్స్ కాలేయ సమస్యలు, విషప్రయోగాలు, అంటు వ్యాధులు, విష  జ్వరాలకు మందుగా గాడిద పాలను వినియోగించినట్లు గ్రంథాలు చెప్తున్నాయి. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌  నివేదిక.. గాడిద పాలు మనిషి పాలతో సమానంగా పోషక విలువలను కలిగి ఉంటాయని వెల్లడించింది. రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుంచి కాపాడటంతో గాడిద పాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది.

గాడిద పాలతో సబ్బుల తయారీ

గాడిద పాలు మహిళలకు మరింత అందాన్ని ఇస్తాయి బీజేపీ ఎంపీ మేనకాగాంధీ అన్నారు. గాడిద పాలు, మేకపాలతో మహిళలు సబ్బులు తయారు చేయాలని పిలుపునిచ్చారు. లడఖ్ లో ప్రజలు గాడిద పాలతో సబ్బులు తయారు చేస్తున్నారని చెప్పారు. గాడిద పాలతో చేసిన సబ్బులు మంచి గిరాకీ ఉందని చెప్పిన ఆమె, మహిళలు గాడిద పాలతో సబ్బులు తయారు చేసి స్వయం ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు స్త్రీకు మరింత అందాన్ని ఇస్తాయని చెప్పారు.

Related News

Vande Bharat Sleeper: వందే భారత్ లో కాశ్మీర్ వెళ్లిపోవచ్చు, ఎప్పటి నుంచో తెలుసా?

Indian Railways: ఒకే టికెట్ కు రెండు ధరలా? రైల్వేలో ఇలా కూడా జరుగుతుందా?

Boeing Mass layoffs: 17000 మంది ఉద్యోగులను తొలగించనున్న బోయింగ్.. వేల కోట్ల నష్టమే కారణం..

Dussehra : దసరా బోనస్​ వచ్చిందా? – ఇలా చేస్తే మరింత ఎక్కువ సంపాదించొచ్చు!

Railways New Service: ఒకే టికెట్ తో 56 రోజుల ప్రయాణం- దేశం అంతా చుట్టేయొచ్చు, ధర కూడా తక్కువేనండోయ్!

Ratan Tata Successor: రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడెవరు? పోటీలో ఉన్న ముగ్గురి ప్రత్యేకత ఇదే!

Airtel Acquire TATA Play: టాటా ప్లే కొనుగోలు చేసే యోచనలో ఎయిర్ టెల్.. డిటిహెచ్ రంగంలో విప్లవమే..

Big Stories

×