BigTV English

Diwali Safety Tips: దీపావళి పండుగను హ్యాపీగా జరుపుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పని సరి!

Diwali Safety Tips: దీపావళి పండుగను హ్యాపీగా జరుపుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పని సరి!

Safety Tips Of Diwali 2024:  దీపావళి వేడుకను కుటుంబ సభ్యులు అంతా కలిసి ఆనందోత్సాహలతో జరుపుకుంటారు. ఇంటి చుట్టూ దివ్వెలు వెలిగిస్తారు. శ్రీమహా లక్ష్మికి పూజ చేస్తారు. పిండి వంటలు తింటూ ఆహ్లాదంగా గడుపుతారు. సాయంత్రం కాగానే.. చిన్నా, పెద్దా అంతా కలిసి టాపాసులు కాల్చుతూ ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు బాణా సంచా కాల్చే సమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. పండుగ ఉత్సాహం అంతా మాయం అవుతుంది. అలా కాకుండా పండుగను మరింత ఆనందంగా జరుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


దీపావళి రోజు పాటించాల్సిన జాగ్రత్తలు

ప్రతి ఏటా దీపావళి సందర్భంగా పటాసులు కాల్చుతూ ఎంతో మంది గాయపడుతున్నారు. కళ్లు, చేతులకు గాయాలు చేసుకుంటున్నారు. బాణా సంచా పేల్చే క్రమంలో కళ్లు పోయిన సందర్భాలు ఉన్నాయి. దీపావళి రోజున చాలా మంది హాస్పిటల్ కు వెళ్లి పరిస్థితి తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పండుగ నిర్వహించుకోవాలి. అలా చేసుకోవాలంటూ  తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు డాక్టర్లు..


* బాణాసంచా కాల్చే సమయంలో నిప్పు రవ్వలు మీద పడ్డా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కాటన్ దుస్తులు ధరించాలి.

* బాణాసంచా కాల్చే సమయంలో నిప్పు రవ్వలు పడకుండా కళ్లజోడు పెట్టుకోవాలి.

* పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు దగ్గరే ఉండటం మంచిది.

* పొడవుగా ఉన్న క్యాండిల్స్‌, అగరుబత్తీలతో మాత్రమే బాణాసంచా కాల్చాలి.

* పెద్ద టపాసులు కాల్చే సమయంలో ప్యాకెట్ల మీద ఉన్న సేఫ్టీ సూచనలను ముందుగా చదవాలి. వాటిని పాటిస్తూ పేల్చాలి.

* టపాసులు కాల్చే సమయంలో పిల్లల చెవులలో దూది పెట్టడం మర్చిపోకూడదు. లేదంటే శబ్ద తీవ్రతకు కర్ణభేరి దెబ్బతిని చెవి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

*భూ చక్రాలను కాల్చే సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చెప్పులు వేసుకోవాలి.

*బాణాసంచా కాల్చే ప్లేసుకు పాకే పిల్లలను రాకుడా జాగ్రత్త పడాలి

* ఒకపారి అంటించిన పటాసులు పేలకపోతే, దాని దగ్గరికి వెంటనే వెళ్లి చూడకూడదు. ఒక్కోసారి కాస్త టైమ్ తీసుకునే పేలే అవకాశం ఉంటుంది.

* కొంత మంది టపాసులు డబ్బాలు, సీసలు, కుండల్లో పెట్టి కాల్చుతారు. ఒక్కోసారి అవి పగిలి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది.

* అనుకోని పరిస్థితులలో నిప్పురవ్వలు ఎగిసిపడి చిన్న చిన్న గాయాలు అయితే ప్రథమ చికిత్స చేసుకునేందుకు బర్నాల్‌, కాటన్, అయోడిన్‌,  డెట్టాల్‌ లాంటి వస్తువులను దగ్గర ఉంచుకోండి.

*ఒక గాయాలు అయిన తర్వాత ఇంటి దగ్గర ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఒక వేళ బాధ తగ్గకపోతే, డాక్టర్ దగ్గరికి వెళ్లడం ఉత్తమం.

* ఒకవేళ టపాసుల కు సంబంధించి ముక్కలు గుచ్చుకుంటే నేరుగా తీయకుండా, హాస్పిటల్ కు తీసుకెళ్లి డాక్టర్ తో తీయించుకోవాలి.

* ఒకవేళ బాణాసంచా పేల్చే సమయంలో అగ్నిప్రమాదాలు జరిగితే ఆర్పేందుు నీళ్లు పక్కనే ఉంచుకోవాలి. మంట తీవ్రత ఎక్కువగా ఉంటే ఫైర్ సిబ్బందికి సమాాచారం ఇవ్వండి మంచిది.

Read Also: దీపావళి నాడు దీపాలు ఎందుకు వెలిగిస్తారు? పురాణాలు ఏం చెప్తున్నాయి? శాస్త్రీయ కారణాలేంటి?

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×