BigTV English

Actor Darshan : కన్నడ హీరో దర్శన్ కు సర్జరీ..?

Actor Darshan : కన్నడ హీరో దర్శన్ కు సర్జరీ..?

Actor Darshan : కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ వేరైనా కూడా తన అభిమాని హత్య కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చెయ్యడం పెను సంచలంగా మారింది. అభిమానిని దగ్గరుండి హత్య చేయించారనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్నాడు. ఈయనకు లగ్జరీ ఫెసిలిటీస్ జైల్లో ఉన్నాయని ఆ మధ్య ఓ వార్త వైరల్ అయ్యింది. ఇక జైల్లో దర్శన్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా ఈయన గురించి మరో న్యూస్ వైరల్ గా మారింది.. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌ కోరుతూ దర్శన్‌ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ విశ్వజిత్‌ శెట్టి విచారించారు.. పిటిషన్‌ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌ ప్రసన్నకుమార్‌కు సూచించారు. బళ్లారి జైలులో దర్శన్‌ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్‌ అవసరముందని వైద్యులు తెలిపారు.. ఈయన తరపున లాయర్లు కోర్టుకు నోటీసులు అందించారు. అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు. దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు..

ప్రస్తుతం దర్శన్ కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇకపోతే దర్శన్‌, పవిత్రలు జూన్‌ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల సిట్‌ చార్జిషీట్లు దాఖలు చేయడం తో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు కొందరు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్‌ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్‌ జైల్‌లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. ఈ క్రమంలో మరోసారి వారు బెయిల్‌ పిటీషన​ వేశారు.. ఈ పిటిషన్ పై మరో సారి న్యాయ స్థానం విచారణ జరిపించాల్సి ఉంది. సర్జరీ అత్యవసరం అనుకుంటే మాత్రం దర్శన్ కు బెయిల్ ఇవ్వాలి అని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక ఈ కేసు రోజుకో ట్విస్ట్ లతో జనాలకు మైండ్ బ్లాక్ చేస్తున్నారు పోలీసులు. అసలు తప్పు ఎక్కడ జరిగింది అనే దానిపై పోలీసులు విచారణ జరుగుతుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈయన జైలు నుంచి బయటకు రావడం కష్టమే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..


 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×