BigTV English
Advertisement

Diwali 2024: దీపావళి నాడు దీపాలు ఎందుకు వెలిగిస్తారు? పురాణాలు ఏం చెప్తున్నాయి? శాస్త్రీయ కారణాలేంటి?

Diwali 2024: దీపావళి నాడు దీపాలు ఎందుకు వెలిగిస్తారు? పురాణాలు ఏం చెప్తున్నాయి? శాస్త్రీయ కారణాలేంటి?

Deepawali Festival 2024: హిందువులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండుగలలో దీపావళి పండుగకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. దీప అంటే దీపం. ఆవళి అంటే వరుస. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపాలన్నీ వరుసగా పెట్టి వేడుక జరుపుకోవడాన్ని దీపావళిగా పిలుస్తారు. అమావాస్య రోజున చుట్టూ చీకట్లు కమ్ముకుంటాయి. ఈ దీపాలతో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపడమే దీపావళి ప్రత్యేకత. చీకటిలో చెడు శక్తులు ఉంటాయని ప్రజలు భావిస్తారు. దీపాలను వెలిగించి వాటిని తరిమికొట్టవచ్చని చాలా మంది నమ్ముతారు. దీపావళి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని.. ఐష్టైశ్వర్యాలు అందిస్తుందని హిందువులు భావిస్తారు.


దీపావళి ఎందుకు జరుపుకుంటారు?

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను నిర్వహించుకుంటారు. వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన రోజు దీపావళి జరుపుకుంటున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. రావణ సంహారం తర్వాత అయోధ్యలో రాముడు పట్టిభిషేకం తీసుకుని పాలన మొదలు పెట్టింది కూడా ఇదే రోజు అని గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ చేత నరకాసురుడిని సహరించేలా చేశారని పురాణాలు చెప్తున్నాయి. నరకాసురుడి వధ అనంతరం ప్రజలు సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు. ఆ రోజు అమావాస్య కావడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. త్రేతాయుగం నుంచి దీపావళి పండుగ జరుపుకుంటున్నట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.


దీపాలు వెలిగించడం వెనుకు సైంటిఫిక్ రీజన్స్

దీపం అనేది మనిషిలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుందని పెద్దలు చెప్తుంటారు. చీకటిని వెలుగు పారద్రోలినట్లుగానే అజ్ఞానాన్ని జ్ఞానం పారద్రోలుతుందని భావిస్తారు. దీపం వెలిగించడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలిగి, జీవితాల్లో వెలుగు నిండుతుందని నమ్ముతారు. దీపావళి రోజున నెయ్యితో దీపాలు వెలిగిస్తే ఇంట్లో ఆనందం, సంతోషం కలుగుతుందని భావిస్తారు.  నెయ్యితో దీపాలు వెలిగించడం ఇంట్లోని హాని కారణ సూక్ష్మక్రిములు చనిపోయి మనుషులు ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు. ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం ద్వారా కాలుష్యం తగ్గి వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది. అందుకే దీపావళి రోజున చాలా మంది నెయ్యితో దీపాలు వెలిగిస్తారు.

Read Also: దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగించాలి.. పాటించాల్సిన ఆచారాలు ఏమిటి ?

అగ్ని అనేది పంచభూతాల్లో ప్రధానమైనది. భూమ్మీద ఉన్న జీవరాశుల మనుగడకు ఎంతో ఉపయోగపడుతుంది. దీపావళి రోజున దీపాలు వెలిగించడం ద్వారా అగ్నిదేవుడికి కొలిచినట్లు అవుతుందని హిందువుల నమ్మకం. దీపాలు వెలిగించే సమయంలో ఎరుపు, నీలం, పసుపు వర్ణాలు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవతలకు ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే, దీపావళి రోజున దీపాలు వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రధానం దీపావళి రోజున ఇంటి ముందు దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకం వచ్చి, తనను భక్తితో కొలిచిన వారికి సంపద ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మొత్తంగా దీపావళి రోజున దీపాలు వెలిగించడం వెనుక భక్తితో పాటు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×