BigTV English

KTR: వారి విడాకులకు నేను కారణం అనడం బాధించింది.. కొండ సురేఖపై చర్యలు తీసుకోండి: నాంపల్లి కోర్టులో కేటీఆర్

KTR: వారి విడాకులకు నేను కారణం అనడం బాధించింది.. కొండ సురేఖపై చర్యలు తీసుకోండి: నాంపల్లి కోర్టులో కేటీఆర్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తికి ఆయన తన వాంగ్మూలం సమర్పించారు. ఆధారాలు లేకుండా మంత్రి స్థాయిలో ఉన్న కొండా సురేఖ తనపై తీవ్రమైన తప్పుడు ఆరోపణలు చేశారంటూ వివరించారు. సదరు మంత్రిపై తాను 100 కోట్ల మేర పరువు నష్టం దావా దాఖలు చేశానన్నారు.


చర్యలు తీసుకోవాల్సిందే…

బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న ఓ మహిళా ప్రజాప్రతినిధి తనపై చేసిన హేయమైన ఆరోపణలపై కోర్టు క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ విన్నవించారు.  మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు సాక్షుల వాంగ్మూలాన్ని సైతం కోర్టు నమోదు చేసింది.


ఇంచు ఇంచు చెప్పిన గులాబీ అగ్రనేత…

అనంతరం కేటీఆర్‌ గురించి కొండా సురేఖ ఏం మాట్లాడారని కోర్టు అడిగింది. ఫిర్యాదు కాపీలో పూర్తి వివరాలున్నాయని కేటీఆర్ తరుఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.  స్పందించిన న్యాయమూర్తి, సదరు కాపీలోని వివరాలనే ఆధారంగా తీసుకోమంటారా లేక వాంగ్మూలం ఇస్తారా అని కోర్టు మరోసారి వివరణ అడిగింది. స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారన్నారు. ఆ వ్యాఖ్యల్ని వివరంగా చెప్పమంటే చెప్పగలనన్నారు. అందుకు కోర్టు అనుమతించగా, ఆమె వ్యాఖ్యల్ని కేటీఆర్‌ చదివి వినిపించారు.

అసత్య మాటలకు నొచ్చుకున్నా…

నాగ చైతన్య, సమంత విడాకులకు తాను కారణమని ఆమె అన్నారని, కొండా సురేఖ అసత్య ఆరోపణలతో తీవ్రంగా నొచ్చుకున్నానన్నారు. మంత్రి మాటలకు మనస్తాపానికి గురైనట్లు కేటీఆర్‌ నాంపల్లి ప్రత్యేక కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌తో పాటు జగదీశ్వర్‌ రెడ్డి, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్‌లు వెళ్లారు.

సాక్షుల వాంగ్మూలనం నమోదు…

నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌, సమంతల విషయాల్లో తప్పుడు మాటలు మాట్లాడారని, తాను ఫోన్లు ట్యాప్ చేశానని, నా వల్ల పెళ్లిల్లు బ్రేక్ అవుతున్నాయన్నారు. కేసు విచారణ కోసం కేటీఆర్‌ ఇచ్చిన వాంగ్మూలం సరిపోతుందని కోర్టు అభిప్రాయపడింది. తర్వాత ఆయన తరుఫున సాక్షుల స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసింది.

అగ్రరాజ్యంలో ఆరేళ్లు చదివిన…

ఆరేళ్లు అమెరికాలో చదువుకున్నానని, చదువు పూర్తి అయ్యాక ఇండియాకు తిరిగి వచ్చానన్నారు. భారత్‌కు వచ్చాక, తెలంగాణ ఉద్యమం జరుగుతోందని గుర్తు చేశారు. కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి 2006 ఆగస్టులో రాజీనామా చేశారన్నారు. దీంతో మరోసారి ఉపఎన్నికలు వచ్చాయన్నారు.

టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా చేశా…

2006 నుంచి 2009 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీగా పనిచేశానన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశానన్న కేటీఆర్,  2009లో తొలిసారిగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన తాను, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందానని, ఇక 2014లో మంత్రిగా, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా పనిచేశానన్నారు,

రాష్ట్రాన్ని నడిపించా…

2023 వరకు తెలంగాణ మంత్రిగా రాష్ట్రాన్ని నడిపించానని, అలాంటి నాపై మంత్రిగా ఉన్న కొండా సురేఖ లేనిపోనీ అసత్య ఆరోపణలు చేసిందని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు.

సమాజంపై ప్రభావం…

మంత్రి కొండా సురేఖ ఏ ఆధారాలు లేకుండా తనపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాంటి మాటలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి స్థాయిలో ఆమె చేసిన వాఖ్యలు చాలా ప్రచార మధ్యమాల్లో ప్రసారమయ్యాయని, దీంతో నా పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయన్నారు.

18 ఏళ్లుగా వాళ్లు నాకు తెలుసు…

తాను ఫోన్ ట్యాపింగ్ చేశానని కొండా సురేఖ చెప్పిన మాటలు పూర్తిగా పూర్తిగా అసంబద్ధం, అవాస్తవం అన్నారు. ఇక డ్రగ్స్ విషయంపైనా ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు, సాక్షులు గత 18 ఏళ్లుగా తనకు తెలుసు అని పేర్కొన్నారు. కొండా సురేఖ వాఖ్యలను టీవీలో చూసిన సాక్షులు నాకు ఫోన్ చేశారన్నారు. ఓ వైపు రాజకీయ కక్ష్య సాధింపు, మరోవైపు పబ్లిసిటీ వీటికోసమే తనపై అనుచితమైన ఆరోపణలతో బీఆర్‌ఎస్‌ పార్టీని దెబ్బతీశారన్నారు.

చట్ట ప్రకారం శిక్షించండన్న వర్కింగ్ ప్రెసిడెంట్… 

సమాజంలో తనకున్న మంచి పేరు ప్రతిష్టాలను దిగజార్చాలానే అలాంటి వాఖ్యలు చేశారన్నారు. యూట్యూబ్ లింక్స్, పత్రికా వార్తలను కోర్టుకు ఇచ్చాన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకని చట్ట ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ కోర్టుకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

Also Read : హైకమాండ్ ఆదేశాలతోనే ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం, కానీ జీవన్ రెడ్డి

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×