BigTV English

Kuna Ravi Kumar: KGVB ప్రిన్సిపల్‌ ఆరోపణలపై ఎమ్మెల్యే కూన రవి రియాక్ట్..

Kuna Ravi Kumar: KGVB ప్రిన్సిపల్‌ ఆరోపణలపై ఎమ్మెల్యే కూన రవి రియాక్ట్..

Kuna Ravi Kumar: శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పై పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే.. ప్రిన్సిపల్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు. కేజీబీవీ పాఠశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకు, విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, వారికి ఉపయోగించాల్సిన నిత్యావసరాలను దారి మళ్లించడం వంటి అంశాలను ప్రశ్నించినందుకు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.


ప్రిన్సిపల్ ఆరోపణలన్నీ అవాస్తవం -ఎమ్మెల్యే రవి
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, గతంలో సస్పెండ్ అయిన చరిత్ర ఉన్న ఆ ప్రిన్సిపల్‌ను అడ్డుపెట్టుకొని తనపై బురదజల్లేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారన్నారు. తల్లికి వందనం కార్యక్రమంపై ముగ్గురు ప్రిన్సిపల్స్‌తో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్‌తోనే వీడియో కాల్ తీసుకున్నట్లు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు అని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే.. తిరిగి రాగానే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానంటూ ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారు.

ఎమ్మెల్యే మానసికంగా వేధిస్తున్నాడంటూ ప్రిన్సిపల్ ఆరోపణలు
ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రిన్సిపల్ సౌమ్య ప్రధాన ఆరోపణ చేశారు. ఎమ్మెల్యే అనుచరులు సైతం నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్యెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. నావల్ల కావడం లేదంటూ.. మీటింగుల పేరుతో రాత్రి 11 గంటల వరకు ఇబ్బంది పెడుతున్నారని మీడియా ముందు కన్నీరుపెట్టుకుంది. ఉన్నతాధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పిందే వింటున్నారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు తనపై అవినీతి ఆరోపణలు చేసి ఇచ్చాపురం ట్రాన్స్‌ఫర్ చేశారని మండిపడిందామే. ఇదే విషయంపై SC కమిషన్‌కు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే సరైన ఆధారాలు సమర్పించాలని ఎస్సీ కమిషన్ ఆమెకి రిటర్న్ మెయిల్ పంపించింది.


సౌమ్యపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం
సౌమ్య ఆరోపణలపై TDP శ్రేణులు రివర్స్ ఎటాక్ చేయడం మొదలుపెట్టాయి. ఆమె నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. అవినీతి చేసింది కాబట్టే అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యారని ఆరోపించారు. గతంలో కూడా ఆమె రణస్థలంలో అవినీతి చేసి సస్పెండ్ అయ్యారని విమర్శించారు. దళిత కార్డు ఉపయోగించి కూన రవికుమార్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే

అయితే.. నిన్న పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే కూనరవికుమార్ సహా పలు ఘటనలపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర అధిష్టానాన్ని ఆదేశించారు. నేతలు వ్యక్తిగతంగా చేసే తప్పులతో పార్టీకి నష్టం కలుగుతుందని ఫైరయ్యారు.

Related News

Adarana 3 Scheme: ఆదరణ 3.0 స్కీమ్.. లబ్దిదారులకు టూ వీలర్స్, ఇక పండగే

Weather Report: ఏపీకి రానున్న మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Tadipatri politics: తాడిపత్రిలో హైటెన్షన్.. ఏడాది తర్వాత పెద్దారెడ్డి ఎంట్రీ, భారీగా పోలీసుల మోహరింపు

Nara Lokesh: అర్జెంటుగా ఢిల్లీకి లోకేష్.. కారణం అదే?

CM Chandrababu: సీఎం చంద్రబాబు కన్నెర్ర.. ముగ్గురికి మూడింది? రేపో మాపో యాక్షన్ తప్పదా?

Big Stories

×