BigTV English

Dharma Sandehalu:అందుకే తలమీద చేతులు పెట్టుకోవద్దంటారు..

Dharma Sandehalu:అందుకే తలమీద చేతులు పెట్టుకోవద్దంటారు..

Dharma Sandehalu:18 పురాణాల్లో మార్కేండ పురాణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో మదాలస చరిత్ర కొన్ని విషయాలు చెబుతుంది . తన కొడుకు అలర్కుడికి మదాలస కొన్ని సదాచారాలు చెప్పింది. రెండు చేతులతో తలను గోక్కోవద్దని ఒక సందర్భంలో తెలిపింది. రెండు చేతులు అలా పెట్టుకోవద్దని చెప్పడానికి ఒక కారణం ఉంది. లక్ష్మీదేవి చేతి చివర్లలో అంటే వేలి చివర్లలో ఉంటుంది. అందుకే ముక్కునుదాటి లక్ష్మీదేవి పైకి వెళ్లకూడదంటారు. కారణం జంబూశరుడు అనే రాక్షసుడ్ని చంపలేక దేవతలు దత్రాత్రేయుడ్ని ఆశ్రయించారు. దత్తుడు ఒక ఉపాయం ఆలోచించి జంబుడ్ని తన దగ్గరకి తీసుకోవాలని ఆదేశించాడు.


దేవతలు జంబుడ్ని రెచ్చగొట్టి దత్తాత్రేయుడి దగ్గరకి తీసుకొచ్చారు. రాగానే అతడికి దత్రాత్రేయుడి పక్కన లక్ష్మీదేవి కనిపించదట. ఆ రాక్షసుడు వెంటనే ఆ లక్ష్మీదేవిని తనకి ఇచ్చేయాలని అడిగాడు. ఆమె వస్తే తీసుకుపోవచ్చని దత్తాత్రేయుడు చెప్పాడు. సుందరి నాతో రా అంటూ లక్ష్మీదేవిని అడిగాడట. నీతో రావాలంటే తనను రెండు చేతులు పెట్టుకోమని తలమీద పెట్టుకోవాలని షరతు పెట్టిందట. షరతును అంగీకరించి జంబూసరుడు వెంటనే రెండు చేతులు తలమీద పెట్టుకున్నాడు. వెంటనే తల పగిలి రెండు ముక్కలా చనిపోయాడట. ఇది చూసిన దేవతలు ఆశ్చర్య పోయారట. ఎలాంటి యుద్ధం జరగకుండా ఎలా చనిపోయాడని ఆశ్చర్యపోయారు.

నెత్తి మీద చేతులు పెడితే ఇలా చనిపోతారా అని ప్రశ్నించారు. అప్పుడు దత్తాత్రేయుడు ఒక విషయం చెప్పాడట. మనిషి శరీరంలో పాదాల నుంచి కంఠం వరకు లక్ష్మీ ఎక్కడికైనా వెళ్లచ్చు. కానీ నెత్తిమీద లక్ష్మీ వెళ్తే పతనం అయిపోతారు. నెత్తిమీద చేతులు వెళ్లడానికి రెండు అంతరార్ధాలున్నాయి. నెత్తి మీదకి లక్ష్మీ వెళ్లడం అంటే అహంకారం. అంటే ధన:హకారం తలకు ఎక్కకూడదు. డబ్బు ఎక్కువైతే అహంకారం పెరుగుతుంది. అదే జరిగితే పతనం మొదలైపోయినట్టే.


లక్ష్మీదేవి విగ్రహం కానీ, లక్ష్మీదేవి ఉన్న స్థానం కానీ తలపైకి వెళ్తే నాశనమే. లక్ష్మీ లక్షణం తలమీద వెళ్తే పతనానికి అడుగుపెట్టినట్టే. చేతి వేళ్లల్లోని లక్ష్మీదేవి తలపై పెట్టుకుంటే నాశమైపోతారు. అంటే క్రమక్రమంగా క్షిణిస్తారు. తలమీద చేతులు పెట్టుకుని గోక్కోవడం వల్ల ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అప్పులపాలవుతారని శాస్త్రం చెబుతోంది. అనేక రకాలైన ఇబ్బందుపాలవుతారు . కాబట్టి లక్ష్మీనివాస ప్రాంతమైన చేతులు తలపైకి వెళ్లకూడదు.

Parrot:రామచిలుకను పెంచుకుంటే…

Chimakurti:చీమకుర్తిలో చిత్రమైన విగ్రహం …

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×