E-Paper
Advertisement

 Mahabharat: కుక్కతో మొదలైన భారతం కుక్కతోనే ముగుస్తుందట – వ్యాస భారతంలో ఎన్ని మిస్టరీలో తెలుసా..?

 Mahabharat: కుక్కతో మొదలైన భారతం కుక్కతోనే ముగుస్తుందట – వ్యాస భారతంలో ఎన్ని మిస్టరీలో తెలుసా..?
Advertisement

Mahabharat: కుక్కతో మొదలైన మహాభారతం ఎండింగ్‌ కూడా కుక్కతోనే అవుతుందట. అవును మీరు చదువుతున్నది అక్షరాల ముమ్మాటికి నిజం. వేద వ్యాసుడు మహాభారతాన్ని రాసినప్పుడు కుక్కతోనే మొదలు పెట్టాడు. క్లైమాక్స్‌ కూడా కుక్కతోనే రాసి ఎండ్‌ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు కాబట్టి  ఆ కథా కమామిషు ఏంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి అనేది తెలుగు నాట నానుడి. మహాభారతంతో మనకున్న ఎమోషనల్‌ బాండింగ్‌ అలాంటిది. మనకు భారతంతో ఎంతో అటాచ్‌మెట్‌ ఉన్నా కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..  భారతం ఒక కుక్కతో ప్రారంభమై.. మరో కుక్కతోనే ముగిసిపోతుందని.. ఇంకా చెప్పాలంటే ఓపెనింగ్‌ కానీ ముగింపు కానీ కుక్కే కీలక పాత్రధారి అవుతుంది.

మహాభారతం ఆది పర్వం ప్రధమాశ్వంలో కుక్కకు అవమానం:

Advertisement

వేదవ్యాసుడు రాసిన మహాభారతం ఆదిపర్వం, ప్రథమాశ్వం కుక్కకు జరిగిన అవమానంతో మొదలవుతుంది. జనమేజయుడు రాజ్యాధికారం చేపట్టాక.. మహా యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ ప్రాంగణంలోకి ఓ కుక్క వస్తుంది. అధి దేవతల కుక్క సరమ బిడ్డ.. దానిపేరు సారమేయ.. యజ్ఞం జరిగే పరిసరాల్లో కనిపించిన సారమేయ అనే కుక్కను జనమేజయుని కుమారులు, బావమరుదులు వెంటాడి వేటాడి చితకబాది తరిమేస్తారట. సారమేయ గాయాలతో ఏడుస్తూ వెళ్లి తల్లి కుక్క సరమకు జరిగిన సంగతి వివరిస్తుంది. సరమ బిడ్డను తీసుకుని యజ్ఞం జరుగుతున్న చోటుకి వస్తుంది. సభలో ఆసీనుడై ఉన్న జనమేజయ మహారాజును బయటకు పిలిచి..  రాజా నీ బిడ్డలు నా బిడ్డను అకారణంగా చావబాదారు. నా బిడ్డ ఏం నేరం చేశాడు. మీకు జరిగిన నష్టమేమిటి.? అన్యాయమేమిటి.? అని రాజుని నిలదీస్తుంది. జనమేజయుడు కొడుకులను, బావమరుదులను పిలిచి కుక్కను ఎందుకు కొట్టారని ప్రశ్నిస్తే..  యజ్ఞం జరుగుతున్న చోటికి శునకం వస్తే కొట్టకుండా ముద్దుపెట్టుకుని సన్మానం చేస్తామా.. అని పొగరుగా సమాధానం చెప్తారట. ఇలా వేదవ్యాసుడు మహాభారతాన్ని కుక్కకు జరిగిన అవమానంతో మొదులు పెడతాడు. ఈ కుక్కతోనే రాజు ఎలా ఉండాలి..? ‌ప్రజలను ఎలా పాలించాలి. రాజ్యంలోని ప్రతి జీవిని ఏ విధంగా చూడాలి అనే విషయాలు చర్చిస్తాడు.

పాండవులను ఫాలో అయిన కుక్క:

కుక్కకు జరిగిన సన్మానంతో వ్యాసుడు భారతాన్ని ఎలా ముగించారో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

కురుక్షేత్ర యుద్దం ముగిశాక కొన్ని సంవత్సరాలు పాండవులు రాజ్యాన్ని పాలించిన తర్వాత వారు రాజ్యాన్ని మొత్తం వదిలేసి స్వర్గానికి వెళ్లడానికి బయలుదేరుతారు. అప్పుడు వారి వెంట ప్రజలు కొంత దూరం నడిచి వెళ్తారు. తర్వాత మరికొంత దూరం వారి బంధువులు వెళ్తారు. అలా పాండవులు ఉత్తరం వైపు హిమాలయాలు ఎక్కుతూ వెళ్తుంటే.. వారిని వెంబడిస్తున్న వాళ్లు కూడా ఆగిపోతుంటారు. కానీ విచిత్రంగా వారిని ఒక కుక్క వెంబడిస్తూ ఉంటుంది. కొడుకులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, చుట్టాలు, బంధువులు, పుర ప్రజలు ఇలా ఒక్కోక్కరు వదిలేసి వెళ్లినా కుక్క మాత్రం వాళ్లను వెంబడిస్తూనే ఉంటుంది. చివరకు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు దారిలో చనిపోయినా.. కుక్క మాత్రం ధర్మరాజును ఫాలో అవుతూనే ఉంటుంది. చివరకు ధర్మరాజు స్వర్గం మెట్ల వరకు  చేరే సరికి కుక్క కూడా ధర్మరాజుతోనే ఉంటుంది.

యముడిగా మారిపోయిన కుక్క:

స్వర్గ ద్వారానికి చేరుకున్న ధర్మరాజుకు ఘన స్వాగతం పలికేందుకు ఇంద్రుడు వస్తాడు. సశరీరంగా స్వర్గంలోకి రమ్మని అందుకోసం తన రథం ఎక్కమని ఆహ్వానిస్తాడు. అప్పుడు ధర్మరాజు ముందు తనతో పాటు వచ్చిన కుక్కను మీ రథంలోకి ఎక్కించుకోండి అని చెప్తాడు. దానికి ఇంద్రుడు ఒప్పుకోడు. అప్పుడు ధర్మరాజు కుక్క గొప్పధనం గురించి తన వాళ్లు అందరూ దూరమవుతున్నా కుక్క మాత్రం అచంచలమైన విశ్వాసంతో తనను అనుసరించి వచ్చిందని కుక్కను రథం ఎక్కిస్తేనే తాను రథం ఎక్కుతానని లేదంటే తాను స్వర్గంలోకి రానని ధర్మరాజు చెప్తాడు. అప్పుడే కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు తన నిజమైన రూపం ధరించి ధర్మరాజును మెచ్చుకుని వెళ్లిపోతాడు.

పంచమవేదమైన మహాభారతంలో వేదవ్యాసుడు కుక్కకు అవమానం జరిగినా కూడా కుక్కతో నీతి చెప్పించారు. అలాగే అచంచలమైన భక్తి విశ్వాసాలకు ఎంతో గౌరవం దక్కుతుందని చివరలో కుక్కకు గొప్ప గౌరవాన్ని ఆపాదించి ముగించిన విధానం అద్బుతమనే చెప్పాలి.  

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: వారి ఆయుష్షు లక్షల సంవత్సరాలట –  ఇప్పటికీ మన చుట్టూనే తిరుగుతున్నారట – వాళ్లెవరో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×