BigTV English

Diwali: భార్య చేసే ఈ ఒక్క ట్రిక్ తో భర్త సుడి తిరగడం ఖాయం.. ఏంటీ ఆ రహస్యం

Diwali: భార్య చేసే ఈ ఒక్క ట్రిక్ తో భర్త సుడి తిరగడం ఖాయం.. ఏంటీ ఆ రహస్యం
Advertisement

Diwali:  దీపావళి అంటే కేవలం దీపాల కాంతులు, పటాకులు, మిఠాయిల పండుగ మాత్రమే కాదు. ఇది మన జీవితంలో శుభం, సంపద, సౌభాగ్యాన్ని ఆహ్వానించే శక్తివంతమైన సమయం. ఆ రాత్రి మనం చేసే ప్రతి చిన్న పనిలో ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. అదే కారణంగా పూర్వీకులు కొన్ని రహస్యమైన ఆచారాలను మన జీవితంలో భాగం చేశారు. దీపావళి రాత్రి ఒక సాధారణమైన పని చేయడం ద్వారా మన ఇంట్లో అదృష్టాన్ని ఆహ్వానించవచ్చని ఒక విశ్వాసం ఉంది. అది పెద్ద పూజలు కావాల్సిన అవసరం లేదు, పెద్ద ఖర్చు కూడా ఉండదు. కేవలం ఒక రూపాయి నాణెం చాలు.


ఇలా చేయండి

పూజలు ముగిసిన తర్వాత, మీరు నిద్రపోయే ముందు ఒక శుభ్రమైన ఒక రూపాయి నాణెం తీసుకోవాలి. ఆ నాణెం మీ దిండులో ఉంచాలి. ఆ సమయంలో మనసులో ఒకే భావన ఉండాలి నా కుటుంబం సుఖంగా ఉండాలి, నా భర్తకు అదృష్టం కలగాలి అనే ఆత్మభావన. ఈ శక్తి నాణెం ద్వారా విశ్వంలోకి ప్రసరించి, ఆ శుభాన్ని తిరిగి మీ కుటుంబానికి చేరుస్తుంది.


ఉదయాన్నే ఇలా చేస్తే చాలు

తరువాత ఉదయం లేవగానే ఆ నాణాన్ని ఎవరికి చెప్పకుండా తీసుకుని, ఒక పేదవాడికి లేదా 3 సంవత్సరాల లోపు చిన్నారికి ఇవ్వాలి. ఎందుకంటే పేదవాడి చేతికి ఇచ్చిన దానం శుద్ధిగా మారుతుంది. చిన్నారి చేతికి ఇచ్చినప్పుడు అది పవిత్రమైన శక్తిగా తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. ఇదే ఆ రహస్య సూత్రం.

Also Read: Heart-healthy diet: హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గించే ఆహారాలు.. డాక్టర్లకే షాక్ ఇచ్చే ఫలితాలు..

ఆచారం వెనుక దాగి వున్న సత్యం

ఈ ఆచారం వెనుక ఉన్న సత్యం ఏమిటంటే, మనం ఇచ్చే శుభం తిరిగి మన దగ్గరికి వస్తుంది. మనం ఎవరికైనా నిస్వార్థంగా ఇచ్చిన ఆశీర్వాదం, దానంగా చేసిన చిన్నపాటి పనులు మన కుటుంబానికి అదృష్టాన్ని తెస్తాయి. ఆ ఒక్క రూపాయి నాణెం దానం రూపంలో మారినప్పుడు, అది ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తుంది. పూర్వీకులు చెప్పినట్లుగా, విశ్వాసం ఉన్న చోటే శక్తి ఉంటుంది. ఆ విశ్వాసాన్ని మీరు దీపావళి రాత్రి ఒకసారి అనుభవించండి. ఎవరికీ చెప్పకుండా, నిశ్శబ్దంగా ఈ ఆచారం చేయండి. ఒకసారి కాదు, ప్రతి సంవత్సరం దీపావళి రాత్రి చేయడం అలవాటు చేసుకోండి.

పరిస్థితులు  పక్కా మారుతాయి

కాలక్రమేణా మీరు గమనిస్తారు మీ ఇంట్లో పరిస్థితులు మారడం ప్రారంభమవుతాయి. భర్త పనుల్లో అద్భుతమైన అవకాశాలు, కుటుంబంలో సంతోషం, ఆర్థికంగా స్థిరత్వం సహజంగానే ప్రవేశిస్తాయి. ఈ మార్పు నాణెం వల్ల కాదు, ఆ విశ్వాసం వల్ల.

ఈ విశ్వాసాన్ని కూడా పరీక్షించండి

దీపావళి రాత్రి వెలుగులు కేవలం చుట్టుపక్కల కాంతిని కాదు, మన జీవితంలోని చీకట్లను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. ఆ వెలుగులో మీరు ఒక చిన్న ఆచారం ద్వారా ఆశీర్వాదాన్ని ఆహ్వానిస్తే, ఆ వెలుగు మీ జీవితాన్నే మారుస్తుంది. కాబట్టి ఈ దీపావళి, పటాకులు కాల్చడంలో కాకుండా, ఈ విశ్వాసాన్ని కూడా పరీక్షించండి. ఈసారి దీపావళి కాంతి మీ కుటుంబం మీద శాశ్వతంగా ప్రసరించాలంటే, ఈ రహస్య ఆచారాన్ని తప్పక ప్రయత్నించండి.

Related News

Diwali 2025: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ? ఏ నూనెతో వెలిగిస్తే మంచిది ?

Diwali 2025: దీపావళి పండగను ఏ రోజు జరుపుకోవాలి ? అక్టోబర్ 20 లేదా 21 నా?

Lord Hanuman: పూరిలో బేడి హనుమాన్‌.. భగవంతునికి ఎందుకు బేడీలు వేశారు?

Eye Twitching: ఏ కన్ను అదిరితే మంచిది ? పురాణాల్లో ఏముంది ?

Vastu Tips: కర్పూరంతో ఈ పరిహారాలు చేస్తే.. ఎలాంటి వాస్తు దోషాలైనా మటుమాయం !

Samantha: సమంత పూజిస్తున్న ఈ అమ్మవారు ఎవరో తెలుసా? ఈ దేవత ఎంత శక్తిమంతురాలంటే ?

Temple mystery: గుడి తలుపులు మూసేసిన వెంటనే వింత శబ్దాలు..! దేవతల మాటలా? అర్థం కాని మాయాజాలం!

Big Stories

×