Deepika -Smriti Irani: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పని గంటల విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి దీపిక పదుకొనే(Deepika Padukone) పని గంటల కారణంగా పెద్ద ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకున్నారు. ఎక్కువ గంటలపాటు పనిచేయడానికి నిరాకరించిన ఈమె భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల నుంచి తప్పుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.. ఇక ఈ విషయంపై ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ నటి, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) సైతం పని గంటల విషయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఇది పూర్తిగా దీపికా పదుకొనే వ్యక్తిగత సమస్య అని తెలిపారు. అయితే నేను ఎప్పుడు నిర్మాతలకు లాభాలు రావాలన్న ఉద్దేశంతోనే పని చేస్తానని వెల్లడించారు. కొంతమంది పని గంటల విషయాన్ని వివాదంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు కానీ నాకు మాత్రం పని గంటలు అనేది పెద్ద విషయం కాదని తెలిపారు. ఒకానొక సమయంలో నేను ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండేదాన్ని ఆదే సమయంలోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను.
ఇలా పిల్లలు పుట్టినప్పుడు కూడా నేను నిర్మాతలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ఒకనటిగా నా బాధ్యతను నిర్వర్తించానని తెలిపారు. ఇలా ఒక ప్రాజెక్టుకు కమిట్ అయినప్పుడు నిర్మాత గురించి ఆలోచించి పని చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్మృతి ఇరానీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకానొక సమయంలో వరుస సీరియల్స్ ద్వారా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడిపిన ఈమె అనంతరం రాజకీయ వ్యవహారాల కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
పాన్ ఇండియా సినిమాల నుంచి దీపిక ఔట్..
ఇటీవల రాజకీయాలకు ఈమె దూరం కావడంతో తిరిగి ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం స్మృతి ఇరానీ క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ధారావాహిక సీరియల్ ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. స్మృతి ఇరానీ పని గంటల వివాదం పట్ల చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే దీపిక పదుకొనే తనకు చిన్న పాప ఉన్న కారణంతో తాను ఎనిమిది గంటల పాటు పనిచేయని చెప్పడంతో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి ఈమెను స్పిరిట్ సినిమా(Spirit Movie) నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత దీపికను కల్కి 2(Kalki 2) నుంచి కూడా తప్పిస్తున్నట్లు నిర్మాతలు అధికారక ప్రకటన తెలియజేశారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Nagarjuna 100: పొలిటికల్ డ్రామాగా నాగార్జున ‘లాటరీ కింగ్ ‘.. క్యామియో పాత్రలో మరో స్టార్?