Telangana: తెలంగాణ ప్రభుత్వం పత్తి రైతులకు శుభ వార్త తెలిపింది. దీపావళి పండుగ తర్వాత.. నవంబర్ మెుదటి వారంలో పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులు.. 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో సుమారు 24.7 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయినట్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం 342 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కపాస్ కిసాన్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చి.. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.