BigTV English
Advertisement

Negative Things: ఈ వస్తువులు రోడ్డుపై కనిపిస్తే ముట్టుకోకండి, వాటిని తాకితే ఏమవుతుందో తెలుసా?

Negative Things: ఈ వస్తువులు రోడ్డుపై కనిపిస్తే ముట్టుకోకండి, వాటిని తాకితే ఏమవుతుందో తెలుసా?

Negative Things: హిందువుల్లో ఎన్నో నమ్మకాలు, ఆచారాలు ఉంటాయి. వాటిని నమ్మే వారి సంఖ్య కూడా ఎంతో ఎక్కువ. దిష్టి తాకడం, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఎంతోమంది విశ్వసించే అంశాలు. వ్యక్తులకు లేదా వస్తువులకు దిష్టి తీసి పారేయడం అనేది ప్రతి మతంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా రోడ్డుపైనే వీటిని పడేస్తూ ఉంటారు. నిమ్మకాయలు, పచ్చిమిర్చి కలిపి పడేసిన దాఖలాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. చెడు దృష్టిని తొలగించేందుకు నిమ్మకాయని దిష్టి తీసి పడేస్తూ ఉంటారు. అయితే కేవలం నిమ్మకాయ కాదు, కొన్ని వస్తువులు రోడ్డుపై కనిపించినా కూడా వాటిని తాకకూడదు. అవి కూడా మీకు చెడును కలిగించవచ్చు. అలా రోడ్డుపై ఎలాంటి వస్తువులు కనిపిస్తే తీసుకోకూడదో తెలుసుకోండి.


కుంకుమ లేదా సింధూరం

మహిళలకు కుంకుమ లేదా సింధూరం ఎంతో ముఖ్యమైనది. అది వారి వైవాహిక స్థితిని సూచిస్తుంది. అయితే రోడ్డుపైన కుంకుమ, సింధూరం వంటివి దొరికితే మాత్రం వాటిని తాకకుండా వెళ్ళిపోండి. కొంతమంది చేతబడి దుష్ట పూజలు చేయడానికి కూడా వీటిని వాడి పడేస్తూ ఉంటారు. ఇవి వినాశనాన్ని ఆహ్వానిస్తాయని అంటారు. కాబట్టి రోడ్డుపై మీకు కుంకుమ లేదా సింధూరం వంటివి దొరికితే వాటిని ముట్టుకోకుండా దూరంగా ఉండడం ఎంతో ఉత్తమం.


లవంగాలు -తమలపాకులు

లవంగాలు ఆహారంలో భాగంగా వినియోగిస్తాం. తమలపాకులను పూజలకు వినియోగిస్తూ ఉంటాం. ఈ రెండు కూడా మతాచారాల్లో ముఖ్యమైనవి. తమలపాకులను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ రెండూ కలిపి చేతబడి చేయడానికి దుష్ట పూజలకు వినియోగిస్తూ ఉంటారని ఒక నమ్మకం ఉంది. తమలపాకుకు లవంగాన్ని గుచ్చి పడేస్తే వాటిని ముట్టుకోకండి. లవంగాలను ఆకులకు గుచ్చి ఉంచడం ఒక ఆచారంలో భాగమని నమ్ముతారు. ముఖ్యంగా అది చెడే చేస్తుందని ఎంతోమంది విశ్వాసం.

విరిగిన బొమ్మలు

ఇంట్లో పిల్లలకు రకరకాల బొమ్మలు కొనడం సహజమే. వారు ఆ బొమ్మ కాలు, చెయ్యి వేరు చేసి బయటపడేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు చేతుల్లేని బొమ్మలు, కాలు లేని బొమ్మలు, తల లేని బొమ్మలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటిని క్షుద్ర పద్ధతుల్లో చెడు ఆచారాల కోసం వినియోగిస్తారని నమ్మకం ఉంది. కాబట్టి కాస్త వింతగా లేదా విరిగిపోయిన బొమ్మలు కనిపిస్తే ముట్టుకోకుండా వెళ్లిపోవడమే మంచిది. ముఖ్యంగా ఆ బొమ్మలకు పిన్నులు, సూదులు వంటివి గుచ్చి ఉంటే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం.

కొవ్వొత్తులు

కొంతమందికి రోడ్డుమీద కొవ్వొత్తులు కనిపిస్తే ఇంట్లో వాడుకోవచ్చని తీసి పట్టుకెళ్తూ ఉంటారు. కొవ్వొత్తులను చెడు పద్ధతిలో చేసే పూజలకు వాడుతారని ఒక నమ్మకం ఉంది. కాబట్టి కొవ్వొత్తులు కనిపించగానే వాటిని తీసుకోవడానికి ప్రయత్నించవద్దు. ముఖ్యంగా కొవ్వొత్తికి ఎర్రటి పొడి లేదా నల్ల బూడిద అంటుకున్నట్టు అనిపిస్తే వెంటనే దానికి దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం.

Also Read: ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయా.. ఈ నివారణ చర్యలు పాటించండి

కొబ్బరి ముక్కలు

కొబ్బరి కాయ ఒకవైపు కాల్చినట్టు ఉన్నా వాటిని తీసుకోకూడదు. నిజానికి పూజలలో కొబ్బరికాయ చాలా ముఖ్యమైనది. భారతీయ ఇళ్లల్లో పూజ గదిలో కచ్చితంగా కనిపించేది కొబ్బరి కాయ. అయితే కాల్చిన కొబ్బరికాయలు రోడ్లమీద కనిపిస్తే మాత్రం అది చెడు ప్రభావాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ఇంటికి లేదా మనుషులకు కాల్చిన కొబ్బరికాయతో దిష్టి తీసి పడేస్తూ ఉంటారు. అలాగే కొబ్బరికాయల మీద హారతి బిళ్ళలను పెట్టి వెలిగించి వాటితోనే దిష్టి తీసి ఆ కొబ్బరికాయలను పగలగొడతారు. కాబట్టి ఎక్కడ కొబ్బరి ముక్కలు కనిపించినా, కొబ్బరికాయ దొరికిన దాన్ని ముట్టుకోకుండా వెళ్లడమే ఉత్తమం.

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×