E-Paper
Advertisement

Arjita Brahmotsavam: తిరుమలలో ఆర్జిత బ్రహ్మోత్సవం వెనకున్న మిస్టరీ తెలుసా..?

Arjita Brahmotsavam: తిరుమలలో ఆర్జిత బ్రహ్మోత్సవం వెనకున్న మిస్టరీ తెలుసా..?
Advertisement

Arjita Brahmotsavam: తిరుమలలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవాలంటే ఏంటో తెలుసా..? ఆర్జిత బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వెనకున్న అసలు ఉద్దేశం ఏంటో తెలుసా..? భక్తుల కొంగుబంగారమై విలసిల్లే శ్రీవారి భక్తుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నదే ఆర్జిత బ్రహ్మోత్సవం అని ఆగమశాస్త్ర పండితులు చెప్తున్నారు. అయితే ఆర్జిత బ్రహ్మోత్సవం వెనకున్న అసలు విషయాలు, బ్రహ్మోత్సవం నిర్వహించే విధానం లాంటి పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సేవనే ఆర్జిత బ్రహోత్సవం. ఈ సేవ ద్వారా భక్తులు స్వామి వారిని ఈజీగా త్వరగా దర్శనం చేసుకోవచ్చు. ఆర్జిత బ్రహ్మోత్సవం అనేది శ్రీవారికి ప్రతిరోజూ నిర్వహించే ఒక విశిష్టమైన సేవ. వార్షిక బ్రహ్మోత్సవాలకు వెళ్లలేని భక్తుల కోసం, ఆ ఉత్సవాల అనుభూతిని కలిగించేలా ఈ సేవను రూపొందించారు. మూడు వాహనాల మీద స్వామి వారిని ఉంచి హారతి ఇస్తారు.

 ఆర్జిత బ్రహ్మోత్సవం ఎక్కడ జరుగుతుంది. ఎలా జరుగుతుంది:

Advertisement

తిరుమలలోని రాంభగీచా -1 ప్రక్కనే ఉన్న వైభవోత్సవ మండపంలో ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఆర్జిత బ్రహ్మోత్సవానికి టికెట్స్‌ బుక్‌ చేసుకున్న వారిని మాత్రమే ఈ సేవకు అనుమతి ఇస్తారు. ఆలయం బయట వైభవోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామికి ఆర్జిత బ్రహ్మోత్సవం జరుపబడుతుంది. ముఖ్యంగా పెద్ద శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనాలలో స్వామి వారిని వేంచేపు చేయిస్తారు. బ్రహ్మోత్సవానికి సంక్షిప్తంగా నిర్వహించే ఉత్సవమే ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం. కళ్యాణోత్సవం తర్వాత మాత్రమే ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం ప్రతిరోజూ జరుగుతుంది.

ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ ధర ఎంత, ఎలా బుక్‌ చేసుకోవాలి, ఎప్పుడు వెళ్లాలి:

ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ ధర ఒక్కరికి రూ. 500 ఉంటుంది. ఒద్దరికి అయితే వెయ్యి రూపాయలు.. ఈ టికెట్లు మూడు నెలల ముందే ఆన్‌లైన్‌ లో బుక్‌ చేసుకోవచ్చు. అలాగే తిరుమలలోని సీఆర్వో ఆఫీసు దగ్గర కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో బుక్‌ చేసుకుంటే లక్కిడిప్‌లో టికెట్‌ తగిలితే మరుసటి రోజు సేవకు వెళ్లొచ్చు. టొకెన్‌ పొందిన వారు  మద్యాహ్నం ఒంటి గంట ముఫ్పై నిమిషాలకు రిపోర్టు చేయాలి. సేవ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. ఒక్కోసారి రెండున్నర గంటలకు కూడా మొదలవ్వొచ్చు.. మీకొచ్చి టోకెన్‌ మీద టైం ఉంటుంది.

Advertisement

ఆర్జిత బ్రహ్మోత్సవం తర్వాత శ్రీవారి దర్శనం: ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి శ్రీవారి దర్శనం చేయిస్తారు. ఈ సేవలో పాల్గొన్నవారు.. సేవ పూర్తి అయ్యాక సుపథం ఎంట్రీ ద్వారా స్వామి వారి దర్శనానికి వెళ్తారు.

డ్రెస్‌ కోడ్‌: పురుషులు తప్పనిసరిగా పంచె మరియదు కండువా ధరించాలి. మహిళలు కచ్చితంగా చీర లేదా చుడీదార్‌ దుప్పట్టాతో ధరించాలి. అలాగే 12 సంవత్సరాల పిల్లల వరకు తల్లిదండ్రులతో పాటు ఉచితంగా వెళ్లొచ్చు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: శాస్త్రం ప్రకారం పెళ్లి కార్డు ముందుగా ఎవరికి ఇవ్వాలో తెలుసా

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×