E-Paper
Advertisement

తిరుమల వెంకటేశ్వర స్వామి కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

తిరుమల వెంకటేశ్వర స్వామి కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
Advertisement

Lord Venkateswara: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కలలో కనిపించడం అనేది అత్యంత శుభప్రదమైన మరియు అదృష్టకరమైన విషయంగా భక్తులు భావిస్తారట. ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష్య శాస్త్ర పరంగా దీనిని భగవంతుని అనుగ్రహం యొక్క సంకేతంగా పరిగణిస్తారట పండితులు. అయితే శ్రీవారు కలలో కనిపించడం వల్ల కలిగే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శుభకార్యాలు జరగడం: తిరుమల శ్రీవారు మీకు కలలో కనిపిస్తే.. మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు కుదరడం.. లేదా పిల్లలు లేని వారికి సంతానం కలగడం లేదా మీరు తలపెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావడం వంటి శుభాలు జరుగుతాయట.

Advertisement

పాప పరిహారం:  స్వామి కలలో కనిపించడం అంటే మీరు గతంలో చేసిన తప్పులు లేదా పాపాలు తొలగిపోతున్నాయని అర్థమట. ఆధ్యాత్మిక ప్రక్షాళన జరిగి, మీ మనస్సు ప్రశాంతంగా మారుతుందట.

ఆర్థిక సమస్యలు పరిష్కారం: కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీకు కలలో కనిపించారు అంటే  మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే సమయం ఆసన్నమైందని అర్థమట. అలాగే వ్యాపారాల్లో లేదా ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని సూచికగా భావించాలట.

Advertisement

మానసిక బలం: స్వామి వారు కలలో కనిపిస్తే.. మీరు ఏదైనా పెద్ద సమస్యలో ఉన్నప్పుడు లేదా భయంతో ఉన్నప్పుడు స్వామి కలలో కనిపిస్తే నేనున్నాను అనే భరోసా ఆయన ఇస్తున్నట్లు అర్థం చేసుకోవాలట. అది మీకు ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తుందట.

తీర్థయాత్రకు పిలుపు: చాలా మందికి స్వామి కలలో కనిపించిన తర్వాతే తిరుమలకు వెళ్లే అవకాశం దొరుకుతుందట. ఇది స్వామివారు మిమ్మల్ని తన దర్శనానికి పిలుస్తున్నారనే సంకేతంగా భావించాలట.

కలలో ఏ రూపంలో కనిపించారు అనేది ముఖ్యం: కలలో మీరు స్వామివారిని దూరం నుంచి చూస్తే..  మీ కోరిక నెరవేరడానికి కొంత సమయం పడుతుందని, భక్తితో వేచి చూడాలని అర్థమట. అలాగే స్వామివారిని దగ్గరగా చూడటం లేదా స్పర్శించడం కలలో కనిపిస్తే.. ఇది మీరు చేసే పనుల్లో అద్భుతమైన విజయం లభిస్తుందని.. దైవానుగ్రహం మీకు మెండుగా ఉందని సూచిస్తుందట. ఇక కలలో మీరు స్వామి వారి పాదాలను చూస్తే.. ఇది అత్యంత శుభప్రదమట. మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవని.. మీ జీవితంలో స్థిరత్వం వస్తుందని బావించాలట.

శ్రీవారు కలలో వస్తే ఏం చేయాలి: స్వామి వారు కలలో కనిపించినప్పుడు మీరు కొన్ని నియమాలు పాటించాలట. కలలో కనిపించిన మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి.. స్వామివారిని స్మరించుకుంటూ కొద్దిగా బెల్లం లేదా పంచదారను నైవేద్యంగా పెట్టి నివేదించాలట. మీకు వీలైతే వీలైనంత త్వరగా తిరుమలకు వెళ్లి స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలట. ఒకవేళ వీలు కాకపోతే, మీ దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్లాలని పండితులు సూచిస్తున్నారు. మీరు కలలో స్వామివారిని చూసిన రోజున సాత్విక ఆహారాన్ని (శాకాహారం) తీసుకోవడం మంచిదట. అలాగే ఓం నమో వేంకటేశాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలట.

అయితే దైవ దర్శనం కలలో కలగడం అనేది మీ జీవితంలో ఒక మంచి అధ్యాయం ప్రారంభం కాబోతోందనడానికి సంకేతంగా బావించాలట. దీనికి  భయపడాల్సిన అవసరం లేదని.. ఇది ఎంతో పుణ్యప్రదమైనది పండితులు చెప్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మరణించిన వారి కోసం ఎక్కువగా ఏడవకూడదట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×