BigTV English

Akshinthalu : కింద పడిన అక్షింతలు తొక్కితే ఏమవుతుందో తెలుసా…?

Akshinthalu : కింద పడిన అక్షింతలు తొక్కితే ఏమవుతుందో తెలుసా…?

Akshinthalu : బ్రహ్మ నుదుటిపై రాత రాస్తాడు. ధర్మాత్ములు, పెద్దవాళ్లు అక్షింతలను తలపై వేసి ఆశీర్వదించడం ద్వారా తలరాత కొంతైనా మారుతుందని విశ్వాసం. అలాగే నేల రాలిన అక్షింతలు ఎవరూ తొక్కకుండా ఎవరూ నడవని ప్రదేశాల్లో వేయాలి.వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతీ శుభకార్యం లోనూ పెద్దలు, పిల్లలకు అక్షింతలు వేసి దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు సుఖజీవన ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదిస్తారు. దైవసన్నిధిలో పూజారులు మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు. అక్షతలు అనే మాట నుంచి వచ్చిందే అక్షింతలు.


క్షతం కానివి అక్షతలు. అంటే రోకటిపోటుకు విరగని, శ్రేష్టమైన బియ్యం అన్నమాట. అటువంటి బియ్యాని పసుపు లేక కుంకుమతో నేతితో కలిపి అక్షింతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతికరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్రకారాలే అని అన్నారు పెద్దలు. శాస్త్రీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతెగ్గులు సహజం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్వికాలనే త్రిగుణాలకూ కారకము.

పెద్దలు వధూవరులపై అక్షింతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహంలో విద్యుత్తులో కొంతభాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచి, పుచ్చుకునే వాళ్ళ కొంత విద్యుత్ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షింతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు అందుతుని మన పెద్దల నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు, వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షింతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలో ఆంతర్యం, పరమార్థం ఇదే!


ఈఆయుర్వేదం ప్రకారం, చర్మసంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షితలు వేసే వారికి ఎలాంటి రోగసమస్యలున్నా, పుచ్చుకునేవాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపుకుంకుమలు నివారిస్తాయిట. అంతేకాకుండా పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×