BigTV English

Ants : కార్తీక మాసం ఆఖరి రోజు చీమలకి పిండి తినిపించాలి ఎందుకో తెలుసా…

Ants : కార్తీక మాసం ఆఖరి రోజు చీమలకి పిండి తినిపించాలి ఎందుకో తెలుసా…

Ants : కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించబడింది. కార్తీక అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే, నిద్ర లేచి స్నానం చేసిన అనంతరం తులసి కోట వద్ద దీపారాధాన చేయాలి. ఆ తర్వాత పరమేశ్వరుని దేవాలయానికి లేదా విష్ణుమూర్తిని గుడికి వెళ్లి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి స్వామి వారి దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలో నవంబర్ 23వ తేదీన బుధవారం 6:53 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రోజు అంటే నవంబర్ 24వ తేదీన గురువారం తెల్లవారుజామున 4:26 గంటలకు ముగుస్తుంది.


కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానమాచరించాలి. ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు దీపాలు, ఆహారం, దుస్తులను దానధర్మాలు చేయాలి. సంధ్యా వేళలో సూర్యాస్తమయం ముగిశాక చీకటి పడిన తర్వాత నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే విధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించి.. భగవద్గీతను పఠించాలి. దీంతో విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. కార్తీక అమావాస్య రోజున చీమలకు పిండిని తినిపించడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

కార్తీక అమావాస్య రోజున ఇళ్ల ముందు రంగుల ముగ్గులను వేయకూడదని శాస్త్రాలలో చెప్పబడింది. అమావాస్యకు ముందు రోజు పూర్వీకులు తమ ఇంటికి వస్తారని, వారికి ఆర్ఘ్యమివ్వడానికి కార్యాలను చేయడం ద్వారా వంశంలో పురోగతి, అష్టఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. అయితే ఇంటిముందు చెత్తచెదారాన్ని తొలగించి, కల్లాపి నీళ్లను చల్లొచ్చు.


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×