BigTV English

Name Change: పేరు మార్చుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయా.. సక్సెస్ సాధ్యమేనా? ఆస్ట్రాలజీ ఏం చెబుతోంది?

Name Change: పేరు మార్చుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయా.. సక్సెస్ సాధ్యమేనా? ఆస్ట్రాలజీ ఏం చెబుతోంది?

Name Change Astrology: ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఒక మనిషి పుట్టిన సమయం, ఆ సమయానికి ఉన్న నక్షత్రం, రాశిని బట్టి ఏ అక్షరంతో ఏ పేరు పెడితే బాగుంటుందో అన్నీ ఆలోచించి నామకరణం చేస్తారు. ఇది గ్రహాలు, పాలపుంతతో ముడిపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయంలో గ్రహాల అమరిక, భూమి అర్థగోళం, ఖగోళ గోళాలపై నియంత్రణ కలిగి ఉంటుంది. అదే గురుత్వాకర్షణ శక్తి ద్వారా అన్ని జీవుల్ని కలుపుతుంది.


అయితే.. జ్యోతిషశాస్త్రం ప్రకారం పెట్టిన పేరును సంఖ్యాశాస్త్రం ప్రకారం మార్చుకుంటున్నారు. పేరు మార్చుకుని సక్సెస్ అయిన వ్యక్తులున్నారు. మరి నిజంగా ఈ పేరు మార్పు వ్యక్తి జీవితంపై అంత ప్రభావాన్ని చూపుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పేరు మార్చుకోవడంతో విజయం లభిస్తుందా ?

ఒక వ్యక్తి పేరు మార్పు.. అతని స్వభావం, ప్రవర్తన, వ్యక్తిత్వ వైఖరి, ప్రవర్తన, మనస్తత్వం, అదృష్టంపై సానుకూల మార్పులు చేస్తాయంటోంది సంఖ్యాశాస్త్రం. వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. చంద్రుడు భూమికి దగ్గరగా ఉండటం వల్ల మానవ స్వభావం, ప్రవర్తనపై ఆధిపత్య ప్రభావం చూపుతుంది. దాని శక్తులతో సరిపోయేందుకు చంద్రుని గుర్తు ఆధారంగా పేర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. చంద్రుని ప్రభావంతో ఎంచుకునే పేరును నామకరణం చేస్తే.. ఆ వ్యక్తి జీవితంలో ఎంతో ఎదుగుదలను చూస్తాడని, విజయాలను అందుకుంటాడని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.


పేర్లను మార్చుకునేందుకు జ్యోతిషశాస్త్రం, సంఖ్యాశాస్త్రంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎవరైనా తమ పేరును మార్చుకునే ముందు.. వాటిపై సరైన అవగాహన కలిగిన జ్యోతిష్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ రాశి, నక్షత్రంతో సరిపోయే పేరును సెలక్ట్ చేసుకోవడంలో వారైతే సరిగ్గా మార్గనిర్దేశం చేస్తారని చెబుతున్నారు.

వర్ణమాల, రాశిచక్రాల మధ్య సంబంధాన్ని అంచనా వేసి.. మీ జాతక సమాచారంతో పేరు మార్పుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పేరును మార్చుకోవడం చాలా మందికి కలిసివచ్చే విషయం. అలా సంపన్నులైన వ్యక్తులెందరో ఉన్నారు. పేరులో ఒక అక్షరం చేర్చడం ద్వారా వారి జీవితాలను మార్చుకున్నవారూ లేకపోలేదు. అయితే ఇది న్యూమరాలజీని నమ్మే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

 

 

 

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×