Gajakesari Yoga 2025: ఈ ఏడాదిలో రెండవ ప్రధాన రాశి మార్పు త్వరలో జరగబోతోంది. అతిపెద్ద, అత్యంత శుభ గ్రహంగా పరిగణించబడే దేవ గురువు బృహస్పతి మే 14, 2025న మిథున రాశిలోకి ప్రవేశించి, వృషభరాశిలో తన ప్రయాణాన్ని ముగించనున్నాడు. బృహస్పతి దాదాపు ఒక సంవత్సరం తర్వాత తన రాశి మార్చుకోనున్నాడు.
బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించిన కొద్ది రోజులకే.. చాలా శుభప్రదమైన, ప్రయోజనకరమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. బృహస్పతి, చంద్రుల కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. మే 28న చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా ఏర్పడే గజకేసరి రాజయోగం మే 30 వరకు ఉంటుంది. ఈ ప్రభావం 12 రాశుల వారిపై ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి రాబోయే రోజులు చాలా ముఖ్యమైనవి. మీ రాశిలో బృహస్పతి, చంద్రుడి కలయిక రెండవ ఇంట్లో, అంటే సంపద ఇంట్లో గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ఆర్థిక లాభాలను పొందుతారు. అంతే కాకుండా విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసుల్లో అపారమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. గజకేసరి యోగం.. మీకు అద్భుత ప్రయోజనాలను అందిస్తోంది. కుటుంబ సభ్యులకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతే కాకుండా మీ అదృష్టం పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
మే నెలలో ఏర్పడే గజకేసరి రాజయోగం వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. బృహస్పతి, చంద్రుల కలయిక 8వ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల మీకు ఆకస్మిక ప్రయోజనాలు లభించే అవకాశాలు పెరుగుతాయి. అంతే కాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఊపందుకుంటాయి. ఉద్యోగంలో జీతం పెరుగుదల , పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. మీరు శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ముందుకు సాగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కూడా మీరు లాభాలు పొందుతారు. కొత్త వాహనాలు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పెట్టుబడుల్లో లాభాలు కూడా పెరుగుతాయి. మీ అభివృద్దికి ఇది మంచి సమయం.
Also Read: ఎడమ కన్ను అదిరితే శుభమా ? అశుభమా ?
కుంభ రాశి:
కుంభ రాశి వారికి గజకేసరి రాజయోగం ఒక వరం లాంటిది. మీరు వృత్తి, వ్యాపారాలలో మంచి స్థానం సాధించే అవకాశాలు ఉంటాయి. మీ రాశిలోని ఐదవ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా మీ లక్ష్యాలను సాధించడంలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారు ఈ సమయంలో శుభ వార్తలు అందుకుంటారు. మీరు కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.