Eye Twitching Astrology: భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు, జ్యోతిష్యశాస్త్రం వంటి ఎన్నో విభాగాలలో మన శరీరంలో జరిగే కొన్ని స్వల్ప మార్పులను గమనించి వాటికి విశేషమైన అర్థాలను తెలిపారు. అటువంటి వాటిలో ఒకటి కన్ను అదరడం. ఇది చాలా మందికి సాధారణంగా ఎదురయ్యే అనుభవం అయినప్పటికీ.. కొన్ని సాంస్కృతిక నమ్మకాల ప్రకారం, ఇది ఒక సంకేతంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా స్త్రీల ఎడమ కన్ను అదరడం విశేషమైన ఆసక్తి కలిగించే అంశంగా నిలుస్తుంది.
హిందూ సంప్రదాయంలో.. పురుషులు, స్త్రీల కన్నులు అదరడం వేర్వేరు అర్థాలు కలిగివుంటాయి. స్త్రీల విషయంలో.. ఎడమ కన్ను అదరడం శుభ సూచనగా భావించబడుతుంది. ఇది వారి జీవితంలో కొత్త శుభవార్తలు, సంతోషకర సంఘటనలు, గౌరవం, పురస్కారాలు, లేదా వ్యక్తిగత జీవితంలో పురోగతి జరగబోతుందని సూచిస్తుంది. కొందరి నమ్మకాల ప్రకారం.. ఎడమ కన్ను అదరడం ద్వారా వారి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని చెబుతారు.
ఈ నమ్మకాలకు పూర్వీకుల అనుభవం, జ్యోతిష్య విద్య, శరీర సంజ్ఞలపై అధ్యయనం వంటి వేరువేరు మూలాలున్నప్పటికీ.. ఇవి ఆధ్యాత్మిక నమ్మకాలు అని చెప్పవచ్చు. శాస్త్రీయంగా చూసినపుడు.. కన్ను అదరడం అనేది చాలాసార్లు శరీరంలో తాత్కాలిక నాడీ మార్పులు, నిద్రలేమి, ఒత్తిడి, కంటి అలసట, విటమిన్ B12 లోపం వంటివాటివల్ల కూడా వస్తుంది. అందుకే ఇది పూర్తిగా భౌతిక కారణాల వల్ల కూడా కావచ్చు. సంప్రదాయ విశ్వాసాల వల్లా కావచ్చు.
అయితే మన సంస్కృతి ప్రత్యేకత ఏమిటంటే.. శాస్త్రీయాన్ని గౌరవిస్తూ, విశ్వాసాన్ని కూడా సమంగా చూస్తుంది. కొన్ని మార్గాల్లో.. ఈ విధమైన విశ్వాసాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఎవరైనా స్త్రీ తమ ఎడమ కన్ను అదురుతుంటే.. ఇవాళ ఏదో మంచి జరుగబోతోంది అన్న నమ్మకం ఆ ఆమె మనస్సులో ఒక సానుకూల భావాన్ని కలిగిస్తుంది.
Also Read: ఏడాది తర్వాత శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారు ఊహించని లాభాలు
మొత్తానికి చెప్పాలంటే.. స్త్రీల ఎడమ కన్ను అదరడం సంప్రదాయపరంగా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. కానీ దాని పట్ల శాస్త్రీయ అవగాహన ఉండటం కూడా ఉత్తమం. ఇది వ్యక్తుల యొక్క నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నమ్మకాన్ని గౌరవించడమే కాదు.. శరీరంలో జరిగే మార్పులను సరైన దృష్టితో గమనించడం ఆరోగ్యపరంగా కూడా ఎంతో అవసరం.