BigTV English

Allu Arjun T-shirt : నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా Vs పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా.. రచ్చ మొదలు!

Allu Arjun T-shirt : నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా Vs పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా.. రచ్చ మొదలు!

Allu Arjun T-shirt : ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించేశారు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే విపరీతమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది అంటే అప్పట్లో ట్రాఫిక్ జాములు కూడా జరిగావు. అత్తారింటికి దారేది సినిమా టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అప్పట్లో ట్వీట్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల మీద తన ఆలోచనను, సమయాన్ని తగ్గించేశారు. ఒకప్పుడు సినిమా కోసం బాగా కష్టపడేవారు. ఎడిటర్స్ తో కూర్చుని ఎడిటింగ్ చేయించే వాళ్ళు. రీమేక్ సినిమా అయినా కూడా చాలా ఇన్పుట్స్ చెప్పేవాళ్ళు. ముఖ్యంగా ఖుషి సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఖుషి ఒరిజినల్ సినిమాలో ఫిమేల్ ఓరియెంటెడ్ సాంగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు రీమేక్ లో మాత్రం మెసేజ్ ఓరియెంటెడ్ సాంగ్ ఉంటుంది. అంతలా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది.


రాజకీయాల్లో కూడా ట్రెండ్ 

పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. అప్పటికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కెరియర్ తారాస్థాయిలో ఉంది. అత్తారింటికి దారేది లాంటి ఆల్టెం ఇండస్ట్రీ హిట్ సినిమాను సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టాను అంటూ అప్పట్లో మాట్లాడటం మొదలుపెట్టారు. 2019లో పోటీ చేసిన కూడా కేవలం ఒక సీటుకు మాత్రమే పరిమితమయ్యారు. 2024లో పవన్ కళ్యాణ్ పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తే 21 గెలిచారు. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్ లో కూడా కొన్ని వైరల్ అయిన డైలాగ్స్ ఉన్నాయి. వాటిలో మనల్ని ఎవడ్రా ఆపేది అనేది బాగా ఫేమస్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఒక కొత్త లైన్ ను క్రియేట్ చేశారు. చాలా బైక్స్ పై కూడా అదే లైన్ స్టిక్కర్స్ అతికించారు.


నెల్లూరు పెద్ద రెడ్డి తాలూకా 

ఇకపోతే అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ విభేదాలు అన్నీ కూడా సరైనోడు సినిమా సక్సెస్ ఈవెంట్లో మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని ఎప్పుడైతే అల్లు అర్జున్ మాట్లాడాడో అప్పుడు నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. “పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా” అనే డైలాగ్ ఫేమస్ అయిన తర్వాత కూడా, “నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా” అని అల్లు అర్జున్ టీషర్ట్ వేయడం వెనక ఆంతర్యం ఏమిటి.? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఒకరకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా.? అనేది కొంతమంది సందేహం. వాస్తవానికి బ్రహ్మానందం కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా నార్మల్ గా అల్లు అర్జున్ ధరిస్తే పరవాలేదు. కానీ పిఠాపురం ఎమ్మెల్యే వర్సెస్ నెల్లూరు పెద్దారెడ్డి అని కొత్త కాంట్రవర్సీ అభిమానులు దారులు తెరుస్తున్నారు. ఈరోజుల్లో చిన్న చిన్న మాటలు కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆర్గుమెంట్ కు దారి తీసే విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ధరించిన టీషర్ట్ లో కూడా అలాంటివే జరిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read : Sreeleea: 23 ఏళ్లకే యాక్టర్, డాక్టర్, మదర్ అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×