Mangal gochar 2025: మే 12.. 2025న ఆశ్లేష నక్షత్రంలో కుజుడు సంచారం జరగబోతోంది. ఈ సంచారం మే 12న ఉదయం 8:55 గంటలకు జరుగుతుంది. కుజుడు జూన్ 7 వరకు ఆశ్లేష నక్షత్రంలో ఉంటాడు. ఈ రాశికి అధిపతి బుధుడు. గ్రహాల రాకుమారుడిగా పిలిచే బుధుడు తెలివితేటలు, వాక్కు, వ్యాపారం, కమ్యూనికేషన్ వంటి వాటికి కారకుడిగా చెబుతారు. ఈ సంచారం యొక్క ప్రభావం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వారి జీవితాల్లో మార్పు, కొత్త శక్తి లభిస్తుంది.
ఈ సంచారం.. కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలను అందిస్తుంది. ఇది వారి ప్రయత్నాలలో విజయాన్ని అందిస్తుంది. కుజుడి యొక్క ఈ శక్తివంతమైన స్థానం వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా పనుల్లో కొత్తదనం, సానుకూల మార్పులను కూడా తెస్తుంది. అలాగే.. కుజుడు యొక్క ఈ స్థానం సోదరులు , సోదరీమణుల మధ్య సంబంధంలో సామరస్యాన్ని కాపాడుతుంది. ఇల్లు , కుటుంబంలో ఆనందం, శాంతిని పెంచుతుంది.
మిథున రాశి:
కుజుడి రాశి మార్పు మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంల.. మీరు పెట్టుబడి పెట్టడానికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. అంతే కాకుండా ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీ పాత ఆస్తి నుండి కూడా మీరు మంచి లాభాలను పొందుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. కుటుంబంలో కూడా ఆనందం, శాంతిని అందిస్తుంది. పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ సమయం వివాహితులకు, అవివాహితులకు చాలా బాగుంటుంది. సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. అంతే కాకుండా మీ ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది.
తులా రాశి:
ఆర్థిక పరంగా తులా రాశి వారికి రాబోయే సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో చాలా కాలంగా ఏదైనా వివాదం జరుగుతుంటే, దాన్ని పరిష్కరించడానికి మీకు అవకాశం లభిస్తుంది.. ఇది కుజుడి అనుగ్రహంతో.. మీ పెట్టుబడుల నుండి ఊహించని లాభాలను అందిస్తుంది. అంతే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది. దీంతో పాటు.. వీపు, కాలు లేదా తలనొప్పితో బాధపడుతున్న వారి ఆరోగ్యం కూడా ఇప్పుడు మెరుగుపడుతుంది. మొత్తంమీద.. ఈ సమయం మీకు శ్రేయస్సు ,ఆరోగ్యం పరంగా చాలా మంచిది.
Also Read: సింహరాశిలో కేతువు సంచారం.. వీరికి కష్టాలు తప్పవు
మకర రాశి:
ఈ రాశి వారికి కెరీర్ , ఆర్థిక పరంగా ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఉద్యోగంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా వ్యాపారవేత్తలు కొత్త భాగస్వామ్యాలు లేదా ప్రాజెక్టుల నుండి మంచి లాభాలను పొందుతారు. కుజ గ్రహ ప్రభావం వల్ల వృద్ధుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా వివాహితులు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకపోతే జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. రాబోయే కొన్ని రకాల వ్యాపారాలు చేసుకునే వారు కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.