Ketu Gochar 2025: ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత రాశిని మార్చుకుంటుంది. ఈ క్రమంలో.. పాప గ్రహం కేతువు కూడా ఇప్పుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. కేతువు సింహరాశిలోకి వెళ్లి ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి మే 18న ప్రవేశిస్తాడు. కేతువు కదలికలో ఈ మార్పు మొత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. కానీ.. ఈ మార్పు 3 రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. మరి ఆ 3 అదృష్ట రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేతువు ఒక ఛాయా గ్రహం. దీనిని వేద జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు. ఈ గ్రహం త్యాగం, ఆధ్యాత్మికత, మోక్షానికి ప్రాధాన్యత వహిస్తుంది. కేతు గ్రహం మన ఆత్మకు సంబంధించిన లోతైన ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. కేతువు సంచార ప్రభావం చాలా కాలం పాటు వివిధ రాశులపై ఉంటుంది. ఇది ప్రతి 18 నెలలకు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. అందుకే శని తరువాత, కేతు సంచారం అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది.
మే 2025లో, కేతువు 18వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటలకు సింహరాశి, ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారము ఆదివారం నాడు జరుగుతుంది. దీని ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కేతువు యొక్క ఈ సంచారము కొన్ని రాశులకు సవాలుగా ఉంటుంది.
మేషరాశి:
కేతువు సంచారం మేషరాశిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అంతే కాకుండా విద్యార్థులు పరీక్షల గురించి చాలా ఆందోళన చెందుతారు. ఈ ఆందోళన వారి యొక్క మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. వ్యాపారవేత్తలకు, ఈ సమయంలో ఆస్తి ఒప్పందాలు నష్టాలను తెచ్చిపెడతాయి. ఈ సమయంలో.. వృద్ధులు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతే కాకుండా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉన్నతాధికారులు కూడా మీ పనిని ప్రశంసిస్తారు.
ధనస్సు రాశి:
మే నెలలో కేతువు యొక్క డబుల్ సంచారము ధనస్సు రాశి స్థానికులకు చాలా సమస్యలను తెస్తుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నిశ్శబ్దం మిమ్మల్ని మానసికంగా కలవరపెడుతుంది. మీరు ఈ సమయంలో ఏదైనా ఆస్తిని అమ్మడం లేదా అద్దెకు తీసుకోవాలని ఆలోచిస్తుంటే.. ఇది మంచి సమయం కాదు. వృద్ధులకు, ఈ సమయం మానసిక క్షోభ , ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
Also Read: శని ప్రభావం ఇంత ప్రమాదకరమా ? పరిష్కార మార్గాలివే !
కుంభ రాశి:
కేతువు సంచారము కూడా కుంభ రాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, రిస్క్ తీసుకోవడం మీకు మంచిది కాదు. ఉద్యోగులు కూడా నష్టాన్ని కలిగించే ఒప్పందాలు చేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇది భారీ నష్టాలకు దారితీస్తుంది. ఈ సమయంలో.. విద్యార్థులు చెడు సహవాసానికి దూరంగా ఉంటారు. కుంభ రాశి వారికి మే నెల అనుకూలంగా ఉండదు. ఆర్థిక పరంగా చాలా వరకు నష్టపోతారని చెప్పవచ్చు.