Nani: ప్రేక్షకులు తమ అభిమాన హీరోకి ఇచ్చే వ్యాల్యూ కొన్నిసార్లు మాటల్లో చెప్పలేము. దేవుళ్లను ఎలా అయితే పూజిస్తారో కొంతమంది అభిమానులు హీరోలను కూడా అదే రకంగా పూజిస్తారు. వాళ్ల సినిమా వస్తే పాలాభిషేకాలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, పోస్టర్ పై తిలకం దిద్దుతారు. దేవునికి ఏవైతే చేస్తారో అవన్నీ కూడా కొంతమంది హీరోలకి చేస్తూనే ఉంటారు. ఇది ఒక రకమైన అభిమానం. కొంతమంది హీరోలకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. అయితే వాళ్లకి ఆ హీరోతో ఒక ఫోటో దిగితే చాలు అనే ఉద్దేశంతో ఉంటారు. ఒకప్పుడు తమ అభిమాన హీరోని కలవాలంటే సాధ్యమయ్యే పని కాదు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇప్పుడు అభిమాన హీరోలతో మాట్లాడే అవకాశం కూడా వచ్చింది. కొన్నిసార్లు హీరోలు రియాక్ట్ అవ్వకపోయినా కూడా ఎప్పుడో ఒకసారి ఎలా అయినా సరే వాళ్లను కలిసి అవకాశం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది.
నాని సడన్ సప్రైజ్
నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే ఒకటిన్న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ మరియు ట్రైలర్ ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలను పెంచేశాయి. అయితే ఈ రోజుల్లో ఒక మంచి సినిమాలు తీయడం ఎంత ముఖ్యమో, ఆ సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకువెళ్లడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం నాని అదే పనిమీద సీరియస్ గా తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక తమిళ్ అభిమానితో వీడియో కాల్ మాట్లాడి బర్త్డే విషెస్ తెలియజేసాడు. రవి నా అనే ఒక అమ్మాయి నానికి పెద్ద వీరాభిమాని. అయితే రవి నా ఫ్రెండ్ నానికి చెప్పడంతో నాని తన బర్త్డే ఒక రోజు లేట్ అవ్వడంతో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెబుతూ అమ్మాయితో కాసేపు మాట్లాడి అలానే తనకి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పారు. ఆ అమ్మాయి ఆ వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసి ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.
ప్రాంతంతో సంబంధం లేకుండా అభిమానం
బేసిగ్గా ఒకప్పుడు ఒక హీరోకి ఒకే ఇండస్ట్రీలో అభిమానులు ఉండేవారు. ఇప్పుడు అలా కాదు భాషతో సంబంధం లేకుండా ఒకరి టాలెంట్ నచ్చితే కచ్చితంగా అభిమానించడం మొదలు పెడుతున్నారు. అల్లు అర్జున్ విషయానికొస్తే కేరళలో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అలానే తెలుగులో చాలామంది తమిళ్ హీరోలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇప్పటికీ సూర్య నటించిన సినిమా రీ రిలీస్ అయితే థియేటర్ నిండిపోతుంది. రజనీకాంత్, కమలహాసన్, విక్రమ్, సూర్య, కార్తీ వంటి హీరోలు సినిమాలు విపరీతంగా చూడడం మాత్రమే కాకుండా వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు. మనం ఎలా అయితే తమిళ్ హీరోలని అభిమానిస్తున్నాము అలానే తమిళ ప్రేక్షకులు కూడా తెలుగు హీరోలను ఇష్టపడతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాని అభిమాని వీడియో కాల్.
Also Read : Chinmayi Sripada: మతం ఆధారంగానే కాదు ఆధిపత్యం చూపిస్తూ కూడా చంపేస్తున్నారు..!