Mercury Transit 2025 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట వ్యవధిలో తమ రాశులను మార్చుకుంటాయి. గ్రహాల రాశి మార్పు ప్రపంచాన్ని అలాగే 12 రాశుల వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. అన్ని గ్రహాలలో బుధుడికి యువరాజు హోదా ఉంది. చంద్రుని తరువాత బుధుడు.. తన రాశిని తరచుగా మార్చే రెండవ గ్రహం. బుధుడు రాశిలో మార్పు కారణంగా 12 రాశుల వారు తమ ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం , ఆర్థిక స్థితిలో మార్పులను చూస్తారు. విద్య, తార్కికత, తెలివి, వ్యాపారంను సూచించే గ్రహం బుధుడు ఫిబ్రవరి 27న రాత్రి 11:28 గంటలకు బృహస్పతి రాశి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలో బుధుడు సంచారం వలన కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
ఫిబ్రవరి 27న బుధుడు నీచ రాశి మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా మీరు కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. సమస్యలు చాలా వరకు పెరుగుతాయి. మీ రాశిలో బుధ సంచారము మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో ఉంటుంది. అందుకే మీరు ఆస్తి,ఉద్యోగ సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ సభ్యుల విషయంలో కొన్ని తేడాలు తలెత్తుతాయి. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసిన సమయం కూడా వస్తుంది. ఆర్థిక విషయాలపై తీసుకుని నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి:
బుధుడు మిథున రాశిలో సంచరించడం వల్ల మీకు సమస్యలు ఎదురవుతాయి. అంతే కాకుండా ఇబ్బందులు పెరిగే సూచనలు, లాభ అవకాశాలు తగ్గే సూచనలు కూడా ఉన్నాయి. మీ రాశిలో బుధుడు పదవ ఇంట్లో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో మీరు ఉద్యోగం ,వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం తగ్గవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: సూర్యుడి నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం
మకర రాశి :
బుధుడు మీ రాశిలో మూడవ ఇంట్లో సంచరిస్తున్నాడు. మీనరాశిలో బుధుడు సంచారం కారణంగా మీరు మీ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఆఫీసుల్లో చర్చలకు దూరంగా ఉండాలి. ఉద్యోగానికి సంబంధించిన కొన్ని సమస్యలు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మీ మూడవ ఇంట్లో ఉన్న బుధుడు మీ లగ్నస్థాన ఇంటిపై తన దృష్టిని ప్రసరింపజేస్తాడు. ఫలితంగా మిమ్మల్ని తెలియకుండానే కొంత భయం వెంటాడుతుంది. పెట్టుబడుల వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మీరు ఆర్థిక పరంగా తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఆఫీసుల్లో గొడవలు పెరిగేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి.