BigTV English

CM Revanth Reddy: కులగణనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

CM Revanth Reddy: కులగణనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

CM Revanth Reddy: ఈవారం చారిత్రక నిర్ణయాల దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేసింది. కీలకమైన సామాజిక కులగణన సర్వే రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అటు సుప్రీం తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. సీఎం రేవంత్ ఆలోచనలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది.


07-02-2025 శుక్రవారం ( వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసలు )

రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత, ప్రణాళికలు భేష్ అని వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం ప్రశంసించింది. ఈ మేరకు సీఎంకు WEF అధ్యక్షుడు బోర్జ్ బ్రెండె, మేనేజింగ్ డైరెక్టర్ మిరెక్ డూసెక్ లేఖ రాశారు. దావోస్ సదస్సులో పాల్గొని క్రియాశీలక భాగస్వామిగా నిలిచారని అభినందించారు. రైజింగ్​ తెలంగాణ 2050.. నినాదం అందరినీ ఆకట్టుకుందని ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. 2047 కల్లా స్టేట్ నెట్ ​జీరో, హైదరాబాద్ ఫోర్త్ సిటీని దేశంలో మొదటి నెట్​ జీరో చేయాలనే ఆలోచన భేష్ అన్నారు.


తెలంగాణ అభివృద్ధికి అమలుచేస్తున్న ప్రణాళికలు, ప్రజలకు మెరుగైన జీవనప్రమాణాలు అందించే ప్రణాళికలు బాగున్నాయని కితాబిచ్చింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించి, అభివృద్ధిని ప్రజలందరికీ న్యాయంగా చేరువ చేయడం, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై తెలంగాణ ఫాలో అవుతున్న విధానాలు సూపర్ అన్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరం.

07-02-2025 శుక్రవారం ( డ్రోన్ టెక్నాలజీ విస్తరణ )

తెలంగాణలో డ్రోన్‌ టెక్నాలజీ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ రంగంలో ఈ ఏడాది కొత్తగా 500 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సెంటిలియాన్‌, HP రోబోటిక్స్‌ సంస్థల ప్రతినిధులు ఈనెల 7న సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నమ్మకం కలిగేలా పారిశ్రామిక విధానాలు రూపొందిస్తున్నామన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ పరిశ్రమలు విస్తరించే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు 2016 నుంచి ఐటి పరిశ్రమలకు ప్రభుత్వ సబ్సిడీల బకాయిలు 4500 కోట్లు పెండింగులో ఉన్నాయని ఒక్కొక్కటిగా చెల్లిస్తూ వస్తున్నామన్నారు.

07-02-2025 శుక్రవారం ( హైడ్రా స్పీడ్ )

హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా మరింత స్పీడ్ పెంచింది. ఈనెల 7న మహేశ్వరంలోని తుక్కుగూడ మునిసిపాలిటీలో సూరం చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సూరం చెరువు 60 ఎకరాలకు పైగా ఉండేదని.. ప్రస్తుతం 25 ఎకరాల చెరువు మిగిలిందన్నారు రంగనాథ్. సూరం చెరువుకు సంబంధించిన భూమి కబ్జా చేశారని.. త్వరలోనే అన్ని శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తుక్కుగూడలోని చెరువుల ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు చేయడంతోనే కమిషనర్ అక్కడికి వెళ్లి పరిశీలించారు.

07-02-2025 శుక్రవారం ( రేషన్ కార్డు మరింత సులువు )

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సేవలో అప్లై చేసుకుంటే పరిశీలించి మంజూరు చేసేలా జీవో రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్లు ఇచ్చారు. కొందరు తమ పేర్లు లేవని ఇటీవలి గ్రామసభల్లో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇంకొందరివి కుటుంబాలు విడిపోయినా అందరివీ కలిపి ఒకేదాంట్లో ఉన్నాయి. సో ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేలా మీ సేవలో అప్లై చేసుకోవాలని అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో రేషన్ కార్డులు రాని వారికి మంచి అవకాశం దొరికినట్లయింది.

06-02-2025 గురువారం ( డిమాండ్ ఎంతున్నా.. నో పవర్ కట్స్ )

తెలంగాణలో కరెంట్ డిమాండ్ ఎంత పెరిగినా ఎక్కడా ఇబ్బంది రాకుండా రేవంత్ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది.
తెలంగాణ రాష్ట్ర చర్రితలో అత్యధిక రోజూవారీ విద్యుత్‌ డిమాండ్ గురువారం అంటే ఈనెల 6న 15 వేల 752 మెగావాట్లుగా నమోదైంది. గతంలో అత్యధిక డిమాండ్ 2024 మార్చి 8న 15వేల 623 మెగావాట్లుగా నమోదైంది. సాధారణంగా ఏటా మార్చిలో హయ్యెస్ట్ డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది రబీ పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు ఎండల నేపథ్యంలో ఇండ్లు, ఇండస్ట్రీల్లో కరెంటు వాడకం పెరిగింది. దీంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే కొత్త రికార్డు నమోదైంది. రోజువారీ డిమాండ్ మార్చిలో 17 వేల మెగావాట్లకు చేరవచ్చని.. అయితే కరెంట్ పోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతే కాదు డబ్బులు ఆదా చేసేందుకు తక్కువ ధరకే ఇండియన్ ఎనర్జీ ఎక్స్ ఛేంజీలో కొని డిసెంబర్, జనవరి నెలల్లో 982 కోట్ల రూపాయల్ని విద్యుత్ శాఖ ఆదా చేసింది. వేసవిలో ఎంత పీక్ స్టేజ్ ఉన్నా పవర్ కట్స్ లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో థర్మల్ 14,164 మెగావాట్లు , సోలార్ 7,889 మెగావాట్లు , విండ్ పవర్ 128 మెగావాట్లు , హైడ్రో 2,518 మెగావాట్లు , న్యూక్లియర్ 211 మెగావాట్లు , ఇతర గ్రీన్ పవర్ ప్రాజెక్టు ద్వారా 93 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది.

06-02-2025 గురువారం ( సభ్యులకు దిశానిర్దేశం )

ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తోంది.. వాటిని జనంలోకి ఎలా తీసుకెళ్లాలన్న విషయాన్ని కూడా చెప్పడం కీలకమే. అందుకే ఈనెల 6న సీఎల్పీ మీటింగ్ పెట్టి సీఎం, డిప్యూటీ సీఎం ప్రజాప్రతినిధులకు క్లారిఫికేషన్లు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. పథకాలు ఎలా అమలు చేస్తున్నది.. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఎలా చేస్తున్నదీ వివరించారు. చేస్తున్న పనులను జనంలోకి తీసుకెళ్లాలని కూడా దిశానిర్దేశం చేశారు.

06-02-2025 గురువారం ( మరో డీఎస్సీ కోసం )

చెప్పిన మాట ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తాని చెప్పిన ప్రభుత్వం చెప్పినట్లుగా నిర్వహిస్తోంది. అందులో భాగంగానే జనవరి 2 నుంచి 20 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించారు. తాజాగా టెట్ రిజల్ట్ రిలీజ్ చేశారు. జనవరి 27వరకు అభ్యంతరాలు స్వీకరించి తాజాగా ఈనెల 6న తుది కీ, ఫలితాలను ప్రకటించారు. టెట్‌ పరీక్షలకు మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 2,05,278 మంది పరీక్ష రాశారు.

05-02-2025 బుధవారం ( అకౌంట్లలోకి రైతు భరోసా )

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 5న మరోవిడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ అవుతోంది. తాజాగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తంగా 17.03 లక్షల రైతుల అకౌంట్లకు రైతుభరోసా నిధులు జమ చేశారు. నాలుగు స్కీం అమలులో భాగంగా.. రిపబ్లిక్ డే నాడు రైతు భరోసా వేస్తే 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు తొలి విడతగా 6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగుభూమికి 569 కోట్లను చెల్లించింది. ఇక భూమిలేని 18,180 వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇప్పటికే 6 వేల నగదును వారి ఖాతాల్లో జమ చేసింది.

05-02-2025 బుధవారం ( క్రీడాకారులకు ప్రోత్సాహం )

తొలి నుంచి స్పోర్ట్స్ కు చాలా ప్రాధాన్యత ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. దేశ విదేశీ వేదికల్లో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐసీసీ అండర్ 19 టీ ట్వంటీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ప్రతిభ చూపిన తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిషకు కోటి రూపాయల నజరానా ప్రకటించారు సీఎం. భారత వుమెన్స్ క్రికెట్ టీమ్ లోనూ చోటు దక్కించుకుని ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. మరో క్రికెటర్‌ ధ్రుతి కేసరికి 10 లక్షలు, ట్రైనర్ కు 10 లక్షలు ప్రకటించారు. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో త్రిష అదరగొట్టింది. టీమ్‌ఇండియా కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.

04-02-2025 మంగళవారం ( వర్గీకరణకు మోక్షం )

తెలంగాణలోని ఎస్సీలను 3 గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డు కులాల్లో సంఖ్యాపరంగా అధికంగా ఉన్న మాదిగ, ఉప కులాలకు 9% రిజర్వేషన్లు ఖరారు చేసింది. మాల, ఉప కులాలకు 5%, అత్యంత వెనకబడిన బుడగ జంగం తదితర కులాలకు ఒక శాతం రిజర్వేషన్‌ను కేటాయించింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఏకసభ్య కమిషన్‌ నివేదికను తొలుత క్యాబినెట్‌లో, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది.

దీంతో సుప్రీం తీర్పు తర్వాత ఎస్సీలను వర్గీకరించి, రిజర్వేషన్లను ఖరారు చేయడంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీన ఇచ్చిన తీర్పుపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు అదే రోజు ప్రకటించింది. ఎస్సీ ఉప కులాల్లో ఎవరిని ఏ గ్రూపులో చేర్చాలన్న అంశంపై సొంత నిర్ణయం లేకుండా ఏకసభ్య కమిషన్‌ సిఫార్సు చేసిన దానికే కట్టుబడి నిర్ణయాలు తీసుకుంది. ఆయా వర్గాలు, జనాభా, సామాజిక, ఆర్థిక, విద్య వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం 59 కులాలను వర్గీకరించింది.

04-02-2025 మంగళవారం ( బీసీలకు అండగా )

సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్‌ రెడ్డి ఈనెల 4న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు. సర్వేను ఎంత పకడ్బందీగా చేశామో సభ్యులకు వివరించారు. కర్ణాటక, బిహార్‌ సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను స్టడీ చేశామన్నారు. సర్వే నిర్వహించే విధానాలపై వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామని, దాదాపు 50 రోజుల పాటు సర్వే చేశామన్నారు.

గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాలు, ఓవరాల్ గా రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశారు. సర్వే ప్రకారం ఎస్సీలు 17.43 శాతం, బీసీలు 46.25 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ముస్లిం మైనారిటీలు 12.56 శాతం మంది ఉన్నట్లు తేల్చారు. సో లక్ష మంది ఎన్యుమరేటర్స్, 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తో పని పూర్తి చేశారు. సర్వేకు 125 కోట్లు ఖర్చు చేశారు.

03-02-2025 సోమవారం ( ఇక అంగన్వాడీ బ్రేక్ ఫాస్ట్ )

అంగ‌‌‌‌న్వాడీ సెంట‌‌‌‌ర్లలో చిన్నారుల కోసం బ్రేక్ ఫాస్ట్ పథ‌‌‌‌కాన్ని అమ‌‌‌‌లు చేసేందుకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవిని మంత్రి సీతక్క కోరారు. సోమవారం ఢిల్లీలో టీజీ ఫుడ్స్ చైర్మన్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ తో కలిసి మంత్రి సీతక్క కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణ‌‌‌‌లో అమ‌‌‌‌ల‌‌‌‌వుతున్న ప‌‌‌‌థ‌‌‌‌కాల‌‌‌‌తో పాటు.. అంగ‌‌‌‌న్ వాడీ చిన్నారుల‌‌‌‌కు బ్రేక్ ఫాస్ట్ అవ‌‌‌‌స‌‌‌‌రాన్ని కేంద్రమంత్రికి వివ‌‌‌‌రించారు. ఐసీడీఎస్ ద్వారా మహిళలు, పిల్లలకు సంపూర్ణ పోషణను అమలు చేయడంలో తెలంగాణ ముందంజలో ఉందని కేంద్ర మంత్రి దృష్టికి సీతక్క తీసుకెళ్లారు.

ప్రస్తుతం 3 నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న 8.6 లక్షల మంది పిల్లలకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం ద్వారా పూర్తి వేడి భోజనంతో పాటు గుడ్డు, స్నాక్స్ అందిస్తున్నారు. క‌‌‌‌రోనా త‌‌‌‌ర్వాత ప‌‌‌‌లువురు చిన్నారులు పోష‌‌‌‌కార లోపంతో బాధప‌‌‌‌డుతున్నారని, వారి కోసం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను స్టార్ట్ చేయాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ స్కీం వల్ల ప్రతిరోజూ అదనపు పోషకాహారం అందించడం లక్ష్యం. ఈ స్కీం ప్రతిపాద‌‌‌‌న‌‌‌‌ను కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి ప్రశంసించారు.

02-02-2025 ఆదివారం ( పకడ్బందీగా రిపోర్ట్ )

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ ను ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి ఈనెల 2న అందించారు. ఈ సర్వేలో 96.9 శాతం కుటుంబాలు తమ వివరాలు తెలిపాయి. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని కమిషన్‌ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్లు చెప్పిన అధికారులు… రాష్ట్రంలో 46.25 శాతం బీసీ జనాభా ఉన్నట్లు నిర్థారించారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు మంత్రి ఉత్తమ్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×