Surya Nakshatra Gochar: గ్రహాల సంచారం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గ్రహాలు రాశి మారినప్పుడు ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొన్ని రాశుల వారికి గ్రహాల మార్పు అనుకూల ఫలితాలను అందిస్తే.. మరి కొన్ని రాశుల వారికి సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇదిలా ఉంటే సూర్యుడు గురువారం ఉదయం 7: 57 గంటలకు ధనిష్ట రాశిలోకి ప్రవేశించాడు. ధనిష్ట నక్షత్రాన్ని పాలించే గ్రహం కుజుడు. దీనిని సూర్యుడికి మిత్ర గ్రహంగా చెబుతారు. అందుకే సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోకి మారడం వల్ల 12 రాశుల వారికి అద్భుత ఫలితాలు లభిస్తాయి. మరి ఏ ఏ రాశుల వారికి సూర్యుడి నక్షత్ర మాత్రం ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడి నక్షత్ర సంచారం అనేక విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి వృత్తి , వ్యాపార రంగంలో పురోగతి లభిస్తుంది. ఇదే కాకుండా ప్రభుత్వ రంగంలోని వారు కూడా ప్రయోజనాలను పొందుతారు. ధనిష్ట నక్షత్రంలో సూర్యుడి ప్రభావం వల్ల మేష, వృశ్చిక, కన్య, మకర రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి.
మేష రాశి:
ధనిష్ట నక్షత్రంలో సూర్యుడి సంచారం వల్ల మేష రాశి వారికి ప్రభుత్వ రంగాల నుండి ప్రయోజనాలు లభిస్తాయి. అంతే కాకుండా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఆనందంతో పాటు శాంతి వాతావరణం నెలకొంటుంది. కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ వ్యక్తిత్వంతో ప్రజలను కూడా ఆకట్టుకోగలుగుతారు. ఉద్యోగ మార్పుకు కూడా అవకాశాలు ఉన్నాయి. మీ వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. అంతే కాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారు విద్యా రంగంలో సానుకూల ఫలితాలను పొందుతారు. అంతే కాకుండా కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు. అంతే కాకుండా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆఫీసుల్లో కూడా మీ ఉన్నత అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. అంతే కాకుండా మీరు శుభ ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ తల్లిదండ్రుల నుండి కూడా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అంతే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కూడా లాభాలు గడిస్తారు. వ్యాపారులు కూడా భారీ లాభాలు పొందుతారు.
Also Read: బుధుడి సంచారం.. ఫిబ్రవరి 11 నుండి వీరికి రాజభోగం
వృశ్చిక రాశి:
సూర్యుడి సంచారం వృశ్చిక రాశి వారికి ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాకుండా మీ ధైర్యంతో పాటు శౌర్యం కూడా పెరుగుతుంది. మీ లక్ష్యాలను కూడా మీరు పెంపొందించుకుంటారు. మీరు ప్రవర్తించే విధానం కూడా చాలా వరకు మారుతుంది. సంపాదించే అవకాశాలు కూడా మీకు పెరుగుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీరు శుభ వార్తలు అందుకుంటారు.