Saturn Rahu Conjunction: మార్చి 29న.. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం అయిన శని దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీన రాశిలోకి ప్రవేశించాడు. కుంభ రాశి నుండి శని మీన రాశిలోకి ప్రవేశించిన వెంటనే.. 18 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప యాదృచ్చిక సంఘటన జరిగింది.
జ్యోతిష్యశాస్త్రం ఆధారంగా 2025 సంవత్సరం మార్చి నెల చాలా ప్రత్యేకమైనది. మార్చి 29న.. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా చెప్పబడే శని దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీన రాశిలోకి ప్రవేశించాడు. కుంభ రాశి నుండి శని మీన రాశిలోకి ప్రవేశించిన వెంటనే.. 18 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప యాదృచ్చిక సంఘటన జరిగింది. నిజానికి.. వేద జ్యోతిష్య
శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతాయి. అంతే కాకుండా ఇతర గ్రహాలతో సంయోగం చెందుతాయి. గ్రహాల సంయోగం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. రాహువు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు అంతే కాకుండా శని కూడా మీనరాశిలోకి ప్రవేశించడంతో.. మీనరాశిలో శని-రాహువుల కలయిక ఏర్పడుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో శని-రాహువు కలయిక అశుభ కారకంగా చెప్పినప్పటికీ.. కొన్ని సంబంధాల కారణంగా.. రాబోయే సమయం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మరి ఏ రాశుల వారికి శని సంచారం ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనస్సు రాశి:
మీన రాశిలో శని సంచారంతో పాటు రాహువు కలయిక వలన కలిగే ప్రయోజనం చాలా సానుకూలంగా ఉంటాయి. మీ జాతకంలో.. ఈ కలయిక నాల్గవ ఇంట్లో అంటే కేంద్ర స్థానంలో జరిగింది. ఫలితంగా మీ విలాసాలు , సౌకర్యాలు కూడా చాలా వరకు పెరుగుతాయి. మీరు భూమి, ఆస్తి, ఇల్లు , వాహన ఆనందాన్ని పొందవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కూడా వస్తాయి. అంతే కాకుండా ఆఫీసుల్లో మీరు పడిన కష్టానికి మంచి ఫలితాలు పొందుతారు. పనిలో నిరంతర విజయం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
మిథున రాశి:
మీన రాశిలో శని-రాహువు కలయిక మిథున రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పటి నుండి.. మీ ఆఫీసుల్లో మీకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అంతే కాకుండా మీరు వృత్తి ,వ్యాపారంలో కొత్త అవకాశాలను పొందుతారు. నిరుద్యోగులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆర్థిక లాభం పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగులకు రాబోయే కాలంలో జీతం పెరుగుదల, పదోన్నతి లభించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆరోగ్యం కూడా ముందటి కంటే బాగుంటుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
Also Read: హనుమాన్ జయంతి ఎప్పుడు ? శుభ సమయం, పూజా విధానం
వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని, రాహువు కలయిక శుభప్రదంగా ఉంటుంది. మీరు శుభవార్త వినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసే ఏ పెద్ద పని అయినా విజయవంతం అవుతుంది. మీ ఆదాయంలో భారీ పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభం పొందే అవకాశాలు పెరుగుతాయి. ఏదైనా వ్యాపారం చేయాలని అనుకునే వారికి.. రాబోయే సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.