Big Tv Originals: డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగన్ లోని ఆల్కెమిస్ట్ అనే వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ వంటకాల నుంచి వడ్డించే విధానం వరకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో అసాధారణ ఆహార పదార్థాలు లభిస్తాయి. రుచికరమైన ఆహారాన్ని అందించడమే కాదు, ప్రతి వంటకంతో ఒక కథను కూడా చెప్పడం ఇక్కడి ప్రత్యేకత.
డిఫరెంట్ డిషెస్!
ఆల్కెమిస్ట్ రెస్టారెంట్ లో డిఫరెంట్ డిఫెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడి ఆశ్చర్యకర వంటకాల్లో ఒకటి ఫ్రీజ్ డ్రైడ్ సీతాకోక చిలుక. కాలే, పాలకూర లాంటి ఆకుకూరలతో తయారు చేసిన క్రిస్పీ పదార్థాలపై సీతాకోక చిలుక కూర్చొని కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇక్కడి కీటకాలు మంచి ఫుడ్ గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రెస్టారెంట్ యజమానులు చెప్తున్నారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కీటకాలను తినడం సర్వసాధారణం. వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇక్కడ బటర్ ఫ్లై ఫ్రై స్పెషల్ డిష్ గా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
ఆ రెస్టారెంట్ లో మరో స్పెషల్ వంటకం పిగ్ బ్లడ్ డెజర్ట్. ఇది చూడ్డానికి రక్తం చుక్కలా కనిపిస్తుంది. ఇది నిజమైన పంది రక్తం నుండి తయారు చేస్తారు. ఈ రెస్టారెంట్ ఈ స్పెషల్ వంటకాన్ని QR కోడ్ తో అందిస్తుంది. ఇది డెన్మార్క్ లో రక్తదాన ఆవశ్యకత గురించి వినియోగదారులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్డించారు. రక్తం వంటలో మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడటంలో ఎంతో ముఖ్యమని ప్రజలు ఆలోచించేలా చేస్తుంది. కొంతమంది కస్టమర్లు మాత్రం ఈ వంటకాన్ని చూసి దిగ్భ్రాంతికి గురవుతారు.
ఆల్కెమిస్ట్ రెస్టారెంట్ లో సీ ఫుడ్స్, నాన్ వెజ్ వంటకాలను కూడా సృజనాత్మకతో సర్వ్ చేస్తారు. కొన్ని వంటకాలు ఊహించని రుచులతో అందిస్తారు. కొన్ని వంటకాలను పొగతో నిండిన గాజు గోపురం లాంటి పాత్రలో వడ్డిస్తారు. దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఓ సృజనాత్మకతో కూడిన అనుభవాన్ని అందిస్తుంది.
Read Also: ఐస్ క్రీమ్ లో డిటర్జెంట్ పౌడర్.. తింటే పోవడం ఖాయం!
ప్రత్యేకమైన మీల్స్ ఎక్స్ పీరియెన్స్
ఆల్కెమిస్ట్ రెస్టారెంట్ అసాధారణ విందును అందిస్తుంది. ఇది 50-కోర్సుల మీల్స్ ను అందిస్తుంది. అంటే అతిథులకు ఒకదాని తర్వాత మరొకటి చొప్పున 50 చిన్న వంటకాలను అందిస్తారు. ప్రతి వంటకానికి ప్రత్యేక అర్థం ఉంటుంది. రెస్టారెంట్ లైట్లు, శబ్దాలు, వీడియోలను సరికొత్త ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తాయి. డైనింగ్ హాల్ ఒక థియేటర్ లా ఉంటుంది. పైకప్పు సముద్రానికి సంబంధించిన చిత్రాలను డిస్ ప్లే చేస్తుంది. కాసేపటి తర్వాత ఆకాశంగా మారిపోతుంది. ఇక్కడ ఫుడ్స్ కొన్నిసార్లు ఆనందం, కొన్నిసార్లు ఆశ్చర్యం, కొన్నిసార్లు అసౌకర్యం కలిగిస్తుంది.
ఆల్కెమిస్ట్ ను సందర్శించడం అనేది సాహసయాత్రకు వెళ్లడం లాంటిదని చాలా ఇక్కడికి వెళ్లిన కస్టమర్లు అంటారు. ఇక్కడ ఆర్డర్ చేసిన భోజనం రావడానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. కొంతమంది ఈ అనుభవాన్ని ఇష్టపడతారు. మరికొందరు విసుగ్గా భావిస్తారు.
Read Also: పచ్చళ్లు అమ్ముకోండి పర్వాలేదు.. ఆ పచ్చి బూతులు ఎందుకమ్మా?